వీరమల్లుకి ఊహించని అడ్డంకి?

పవన్ ఈ మూడ్ లో ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందని ఎలా అనుకుంటాం.

ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేశారు పవన్ కల్యాణ్. ఇక ఈ సినిమాకు చివరిసారి విడుదల తేదీ ఫిక్స్ చేయడమే ఆలస్యం. ఈసారి వాయిదా పడదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ పవన్ సినిమాకు ఊహించని అడ్డంకి ఎదురైంది.

ఓవైపు దేశవ్యాప్తంగా వార్ మూడ్ అలుముకుంది. పాకిస్థాన్ తో సరిహద్దులకు మాత్రమే ఇన్నాళ్లూ పరమితమైన యుద్ధం, ఇప్పుడు ఇంకాస్త లోపలకు చొచ్చుకొచ్చింది. ఇలాంటి టైమ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు.

ఆల్రెడీ ఈ దిశగా కింగ్డమ్ యూనిట్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో 3-4 రోజులు చూసి విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకునేలా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, సున్నితమైన సమయంలో డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ చేస్తారని ఊహించడం అత్యాశే అవుతుంది.

ఇప్పటికే పాకిస్థాన్ తో జరుగుతున్న యుద్ధంపై తనదైన శైలిలో స్పందించారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ పక్షాన షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించారు.

పవన్ ఈ మూడ్ లో ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందని ఎలా అనుకుంటాం. అటు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ నెలాఖరకు సినిమాను రిలీజ్ చేయాల్సిందే అంటున్నారు. మరోవైపు ‘బుక్ మై షో’ ఓ అడుగు ముందుకేసి, ఏకంగా జూన్ 12 రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేసింది.

ఇలా హరిహర వీరమల్లు విడుదల తేదీపై మరోసారి వాడివేడి చర్చ నడుస్తోంది. యూనిట్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అయింది.

13 Replies to “వీరమల్లుకి ఊహించని అడ్డంకి?”

  1. Chesina movies ki loss ni every year income tax return lo chupichali ante Edo okti chesi every year loss book cheyadam..akkada package inkada loss booking bagane undi pk ki  pakka package , janalaki nindu sunna 

  2. Panilo pani Jakka star Jalaga tho oka cinema laaginchu.khaaleega unnadu elaago..Title “Ali baba,11 mandi MLA lu”,Subtitle:”Y not 175″

Comments are closed.