థియేటర్లు రెంట్ల మీద కాకుండా షేర్ ల మీద రన్ చేయాలనే డిమాండ్ తో టాలీవుడ్ లో ఓ చిన్న పాటి ఉద్యమం మొదలైంది. ముందుగా ఈస్ట్ గోదావరిలో మొదలైన ఈ డిమాండ్ ఇప్పుడు నైజాంలో వినిపిస్తోంది. నైజాంలో బలమైన ఎగ్జిబిటర్లు శిరీష్-సునీల్ చేతులు కలిపి, మిగిలిన ఎగ్జిబిటర్లతో కలిసి ఈ డిమాండ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు నిర్మాతలకు ఇది ఓ పెద్ద తలకాయనొప్పిగా మారబోతోంది. మిగిలిన ఏరియాల సంగతేమో కానీ నైజాంలో అంటే ఎగ్జిబిటర్ల మధ్యలో కాస్త కట్టు వుంది. ఎందుకంటే శిరీష్- సునీల్- సురేష్ ఈ ముగ్గురి దగ్గర ఎక్కువ థియేటర్లు వున్నాయి. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల వరకు ఓకె. కానీ పెద్ద సినిమాలను షేర్ మీద ఆడడం అంటే నిర్మాతలకు అస్సలు కిట్టుబాటు కాదు. అందుకే ఏం చేయాలి అన్న దాని మీద యాక్టివ్ గా వున్న పలువురు నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నారు.
అసలు ఎందుకీ సమస్య?
షేర్ మీద ఆడాలి అనేది చిరకాలంగా వున్న డిమాండ్. కానీ ఇప్పుడు వున్నట్లుండి ఎందుకు బలంగా బయటకు వచ్చింది. దగ్గుబాటి సురేష్ బాబు, ఆసియన్ సునీల్, శిరీష్ ముగ్గురు కలిసి దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది పాయింట్. థియేటర్ల సమస్యలు గతంలోనూ వున్నాయి. ఇప్పుడూ వున్నాయి. రెంట్లు, షేరింగ్ ఈ రెండు విధానాలకు ప్లస్ లూ వున్నాయి, మైనస్ లూ వున్నాయి. ఆంధ్రలో ఈస్ట్ లో తప్ప మిగిలిన చోట్ల ఈ డిమాండ్ అంతగా లేదు. ఇప్పుడు నైజాంలో ఇది కనుక అమలు జరిగితే కచ్చితంగా ఆంధ్రలో కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడతారు.
ఆధిపత్యం కోసమేనా?
మిగిలిన ఏరియాల సంగతి అలా వుంచితే నైజాంలో దగ్గుబాటి సురేష్ బాబు, ఆసియన్ సునీల్ కు చాలా థియేటర్ల లీజులు వున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా వీరి ఆధిపత్యం నైజాంలో కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో చాలా థియేటర్ల గ్రవుండ్ లీజులు, లేదా థియేటర్ లీజుల కాలపరిమితి ముగుస్తోంది. మళ్లీ వాళ్లకే ఇస్తారా? లేదా థియేటర్ల యజమానులే రన్ చేసుకుంటారా? లేక వేరే వాళ్లు తీసుకుంటారా అన్నవి ముందు ముందు తేలాల్సిన ప్రశ్న. కానీ అదే విధంగా థియేటర్లు చేజారితే వీరి ఆధిపత్యం తగ్గుతుంది.
ఇలాంటి టైమ్ లో ఎలాగూ ఆధిపత్యం చేజారుతుంది కనుక, వదిలేసే ముందు బిజినెస్ తీరుతెన్నులు మార్చితే సరిపోతుందనే ఆలోచనతో వీళ్లు ఈ కొత్త పద్దతిని అమలు చేయించాలి అనే పట్టుదలకు వెళ్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది.
కానీ వీళ్లు ముగ్గురూ ఇప్పటికే మెలమెల్లగా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. మల్టీ ప్లెక్స్ లు అయితే ఎలాగూ షేరింగ్ మీదే ఆడతారు కనుక ఇక సమస్య లేదు. మిగిలిన సింగిల్ థియేటర్లను కూడా అటుగా నడిపించాలన్నది ప్రయత్నం. దాన్ని అడ్డుకోవాలన్నది నిర్మాతల ఆలోచన.
ఛాంబర్ మీటింగ్
ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఎగ్జిబిటర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తో సంబంధం లేకుండా చాంబర్ సమావేశం ఏర్పాటు చేయడం కుదరదు. ఈ విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతానికి పెద్ద సినిమాల విడుదలలు ఏవీ దగ్గరలో లేవు. ఇంకా నెల రోజులు టైమ్ వుంది. ఆ లోగా ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చుకోవాల్సి వుంది.
గమ్మత్తేమిటంటే గిల్డ్ పెద్ద దిల్ రాజు. ఆయన నిర్మాతగా నిర్మాతల వైపు వుండాలా? లేదా ఆయన సోదరుడు శిరీష్ తో కలిసి నైజాంలో థియేటర్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అందువల్లు అటు వుండాలా? ఇది కూడా తెలుస్తుంది.
Idi news a ra yerri pooka?
Most of these single screen theatres are stinky. Must convert all of them into multiplexed as ample land is available