“అక్కినేని కాంపౌండ్ లో మరో పెళ్లి బాజా మోగబోతోంది. హీరో సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు.”
48 గంటలుగా గట్టిగా వినిపిస్తున్న పుకారు ఇది. ఈ ఊహాగానాలు ఎంత బలంగా ఉన్నాయంటే, నిజంగానే అతడు రేపోమాపో పెళ్లి చేసుకుంటాడని అంతా దాదాపు ఫిక్స్ అయిపోయారు. కానీ అలాంటిదేం లేదని సుమంత్ స్పష్టం చేశాడు.
“నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ఇలా సింగిల్ గా ఉండడమే బాగుంది. నేనెప్పుడు ఒంటరితనం ఫీలవ్వలేదు. నాకు బోర్ అనే పదానికి అర్థం కూడా తెలియదు. నాకు ఒక తోడు కావాలని ఎప్పుడూ అనిపించలేదు.”
ఇలా సింపుల్ గా తన పెళ్లిపై తేల్చేశాడు సుమంత్. అతడు మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, ఇక జీవితంలో పెళ్లి చేసుకోడని అంతా ఫిక్స్ అయిపోవచ్చు. అంత స్ట్రాంగ్ గా చెప్పాడు.
రొటీన్ లైఫ్ లో బోర్ కొట్టదంటున్నాడు సుమంత్. ప్రతి రోజూ కనీసం 5 గంటలు సినిమా లేదా ఓటీటీ చూస్తాడంట. ఆ తర్వాత సినిమా పనులు, జిమ్ తో బిజీగా ఉంటాడంట. అలా తన రోజు గడిచిపోతుందని చెబుతున్నాడు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వారానికి కనీసం 2-3 సినిమాలైనా చూస్తాడట. అది కూడా ఒక్కటే థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తాడట. అలా పెద్ద సినిమాల నుంచి ఓ మోస్తరు సినిమాల వరకు అన్నీ కవర్ చేస్తానంటున్నాడు ఈ హీరో.
సోలో బ్రతుకే సో బెటరు
Intelligent fellow
Bachelor life is evergreen forever, ippudu vunna girls danger yentha mandhi ainaa love chestharu
Bachelor life is best for ever