అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ఫ్యాన్స్ కు మాత్రం బోలెడు అంచనాలు వున్నాయి. ఈ సినిమా సంగతులు తెలుస్తున్న కొద్దీ ఆసక్తి జనరేట్ అవుతోంది. అల్లు- అట్లీ సినిమాకు ఈ నవంబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు.
అయితే ఆ లోగా అట్లీ ఈ సినిమా కోసం వర్క్ షాప్ లు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ వర్క్ షాప్ లు సుమారు మూడు నాలుగు నెలల పాటు వుంటాయని, ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, అసలు సినిమా నిర్మాణం వన్ బై వన్ ఏ స్టెప్ ల ప్రకారం ముందుకు వెళ్లాలనేది అప్పుడు డిసైడ్ చేస్తారట.
ఈ సినిమాలో కీలకమైన అండర్ వాటర్ ఎపిసోడ్లు వుంటాయట. సినిమాలో ఇవి చాలా కీలకం అని తెలుస్తోంది. సినిమాకు సిజి వర్క్ ఎక్కువ వుండడం, అండర్ వాటర్ ఎపిసోడ్ లు వుండడం వల్ల షూటింగ్ పూర్తయిన నాటి నుంచి విడుదలకు మధ్య కనీసం ఆరు నెలల నుంచి ఏడాది గ్యాప్ వుంటుందని అంచనా.
అట్లీ సినిమా మీదకు బన్నీ వచ్చే సరికి కనీసం నవంబర్ వస్తుందని తెలుస్తోంది. అప్పటి వరకు ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయో గమనించడం, తరువాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా కథా చర్చలు వంటి వాటితో బన్నీ బిజీగా వుండారు.
Ee tamila thambi gaadu naakinchestadu
Wrong choice