ఏపీ నేతల్లారా.. ఇదేనా మీ దేశ‌భ‌క్తి?

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల్లా ఆర్థికంగా దేశానికి అండ‌గా నిల‌వాల‌న్న ఆలోచ‌న ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లెవ‌రికీ ఎందుకు రాలేద‌న్న‌దే ప్ర‌శ్న‌.

దేశ‌భ‌క్తి గురించి ఉత్తుత్తి మాట‌లు చెప్ప‌మంటే, ఏపీ నేత‌లు కోట‌లు దాటిస్తారు. అబ్బో త‌మ‌కు మించిన దేశ భ‌క్తులు లేర‌ని ఉప‌న్యాసాలు దంచికొడుతుంటారు. ఇక డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ దేశ‌భ‌క్తి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవ‌లం నైతిక మ‌ద్ద‌తు త‌ప్ప‌, తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల్లా జాతీయ ర‌క్ష‌ణ నిధికి విరాళం ఇవ్వాల‌న్న క‌నీస ఆలోచ‌న కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆలోచించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

భార‌త్‌, పాక్ మ‌ధ్య భీక‌ర పోరు సాగుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉత్తుత్తి మాట‌ల‌తో ఒరిగేదేమీ వుండ‌దు. దేశానికి ఆర్థికంగా, హార్థికంగా ద‌న్నుగా నిల‌వాలి. ఆ ప‌ని తెలంగాణ స‌ర్కార్‌, అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

రెండు రోజుల క్రితం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌కు మ‌ద్ద‌తుగా, అలాగే త్రివిధ ద‌ళాల వెంట తామున్నామ‌నే సందేశాన్ని పంపుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ర్యాలీ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత జాతీయ ర‌క్ష‌ణ నిధికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఒక నెల జీతాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. అలాగే స‌హ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ స‌హ‌చ‌రులు, పౌరులంద‌రూ కూడా విరాళంలో పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం కూడా ఒక రోజు వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించింది.

రాజ‌కీయంగా ఎన్ని విభేదాలున్నా, ఇలాంటి స‌మ‌యాల్లో జాతీయ స‌మైక్య‌త‌ను చాటాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఏపీలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ, ఉత్తుత్తి ప్ర‌శంస‌ల‌తో స‌రిపెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయితే నైతిక మ‌ద్ద‌తు ఇవ్వాలని కోరారు. జ‌న‌సేన త‌ర‌పున దేశంలోని ప‌లు ప్ర‌సిద్ధ ఆల‌యాల్లో పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో పూజ‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించ‌డం విశేషం. అలాగే క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్‌ కోరారు. ఇలాంటివి ఓకే.

కానీ తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల్లా ఆర్థికంగా దేశానికి అండ‌గా నిల‌వాల‌న్న ఆలోచ‌న ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లెవ‌రికీ ఎందుకు రాలేద‌న్న‌దే ప్ర‌శ్న‌. దేశ‌భ‌క్తి అంటే ఆ విష‌య‌మై తియ్య‌టి మాట‌లు చెప్ప‌డం మాత్ర‌మే కాదు. దేశానికి తామేం చేయ‌గ‌ల‌మో, దాన్ని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో చేయ‌డం అని వీళ్ల‌కు ఎవ‌రు చెప్పాలి? తెలియ‌ని వాళ్ల‌కైతే చెప్పొచ్చు. న‌టించే వాళ్ల‌కు ఎవ‌రైనా ఏం చెబుతార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

18 Replies to “ఏపీ నేతల్లారా.. ఇదేనా మీ దేశ‌భ‌క్తి?”

  1. Rafel కొనొద్దు అన్నది ఎవరు కాంగ్రెస్.  డిఫెన్స్ స్పెండింగ్ అంత నాటకం అన్నది ఎవరు. హిందూ టెర్రర్ అనే పదం వాడింది రాహుల్.  కానీ చంద్ర బాబు పవన్.  కాంగ్రెస్ వయిపు వెళ్లకుండా మోడీ కి మద్దతు ఇచ్చారు మీలాగా కాదు రా wild 

  2. మా అన్నయ్య ముఖ్యమంత్రి గా ఉంటే ఒక సభ పెట్టి ఒక బటన్ నొక్కి నిధులు పంపేవాడు..

    1. 1000కోట్లు అని చెప్పి మావాళ్లు ఇస్తారు లే అని మనసులో అనుకొన్నా అనుకొంటాడు. Last time 500 జేబులో తీసి వేసాడు.

  3. there will be a huge budget allocation for defense, what they are doing with that money. people are paying taxes but, they are not getting basic needs. why people has to sacrifice their money again. just stop spending huge money on politicians and their security. what AP govt did is correct.  

  4. Asalu idanta kadu great andhra jagan garu party karyakarta chanipote helicaftor vesukuni velladu janam vchi helicaftor ni chuttumuttesaru alantidi ippudu oka jawan yuddam chestu maraniste aa kutumbam ni paramarsinchadaniki Enduku vella ledu jagan garu

  5. నీచంగా సంపాదించిన సొమ్ము పరులపాలు కాగలదు. నీలాంటి వంకర మూతోడు ఇంకొకడు ఉండడు.  Donation అనేది నీలాంటోడు చెపితే విని చేసేది కాదు లే. నువ్వు పోయి పిసుక్కో ఇంకేం ఉందిలే. 

  6. నటనలో అన్న ముందు పవన్ అయినా, ఎవరైనా బచ్చాలే అని నెటిజన్లు అనుకుంటున్నారు..!

  7. “ఇంతకీ నీ బాస్ కానీ, నువ్వు కానీ ఎంత విరాళం ఇచ్చి దేశభక్తి చాటుకున్నారు” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..!

Comments are closed.