బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎక్కడ?

సినిమా చేసేవాడికి కథ తెలుసా తెలియదా అని అడగడం వరకే మీ పని. సినిమా చేసే వాడికి కథ తెలుసు.

బాలకృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్.. ఇలా నందమూరి కుటుంబం మొత్తం హీరోలే. అలాంటి కుటుంబం నుంచి మరో హీరో వస్తుంటే, వీళ్లలో ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. అదే విచిత్రం.

వైవీఎస్ చౌదరి కొత్త సినిమా లాంఛ్ అయింది. ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు తారక రామారావును హీరోగా పెట్టి, స్వీయదర్శకత్వంలో వైవీఎస్ చౌదరి ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.

ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇలా ఎవ్వరూ హాజరుకాలేదు. మిగతా నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. బాలకృష్ణ కుటుంబం నుంచి వసుంధర మాత్రమే వచ్చారు.

ఈ సినిమాకు ప్రారంభం నుంచి ఈ ముగ్గురు హీరోలు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే విషయంపై ఓ సందర్భంలో వైవీఎస్ ను ప్రశ్నిస్తే ఆయన కస్సుమన్నారు. “సినిమా చేసేవాడికి కథ తెలుసా తెలియదా అని అడగడం వరకే మీ పని. సినిమా చేసే వాడికి కథ తెలుసు. అంతకుమించి ఉత్సుకత ఏంటి మీకు? వాళ్ల కుటుంబంలో ఉన్న హీరోలందరికీ కథ తెలుసా అని మీరు అడుగుతున్నారు. అలా తెలియాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను.” అంటూ ఫైర్ అయ్యారు.

అప్పట్నుంచి నందమూరి హీరోలకు దూరంగానే ఈ ప్రాజెక్టును ముందుకు జరుపుతూ వస్తున్న చౌదరి, ఇప్పుడీ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే పని మొదలుపెట్టారు. నందమూరి కుటుంబంలో అందరి హీరోల ఆశీస్సులు తమ సినిమాకు ఉన్నాయన్న వైవీఎస్, కనీసం ప్రచారం కోసమైనా ఆ హీరోల్ని సంప్రదిస్తాడేమో చూ

14 Replies to “బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎక్కడ?”

  1. వీడు చేసిన హడావిడికి ఈపాటికే షూటింగ్ ఐపోయింది అనుకున్నా. ఇప్పుడు మొదలు పెడుతున్నాడేంటి వీడు 

  2. It’s so unfortunate that NTR and Kalyan Ram dont have time to support his own brother’s son.

    If they were too busy, they could have at least sent a message or wished him on social media.

  3. బాలయ్య తాత మనవడు తారక రామరావు హీరో అయిపోయాడు ,మొహం లో హీరో కళ వున్నది,  బాలయ్య కొడుకు మోక్షం బాబు మాత్రం హీరో అవలేదు, మోక్షం మబ్బు మొఖం లో హీరో కళ లేదు లే

Comments are closed.