నేటి అణుబాంబు పడితే ఎఫెక్ట్ ఇలా ఉంటుంది

ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా యుద్ధం అప్డేట్స్ చూడాలనుకునేవాళ్లు ఒక బ్యాచ్.

డ్రాయింగ్ రూముల్లో కూర్చుని ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా యుద్ధం అప్డేట్స్ చూడాలనుకునేవాళ్లు ఒక బ్యాచ్. బార్డర్ కి రెండు వైపులా ఉన్నారు ఈ టైపు.

ఇది 1971 నాటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం కాదు. 1999 నాటి కార్గిల్ యుద్ధమూ కాదు. 2025లో యుద్ధమంటూ వస్తే అది అణ్వస్త్రసహిత యుద్ధమని మర్చిపోకూడదు.

మరి రష్యా-ఉక్రైన్ మధ్యలో యుద్ధం వచ్చిందిగా..అక్కడ అణ్వాయుధం పేలలేదుగా అనొచ్చు. ఎందుకు పేలలేదంటే ఉక్రైన్ దగ్గర అణ్వాయుధం లేదు. రష్యా దగ్గర ఉన్నా వేయాల్సిన అవసరం లేదు..ఎందుకంటే ఆ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకోవాలనే ఆబ్జెక్టివ్ ఉంది కనుక.

సరే ఇంతకీ ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ లో ఇండియా ఆబ్జెక్టివ్ ఏమిటి? పహల్గాం లో జరిగిన ఉగ్రవాదచర్యని తిప్పికొట్టడం. అంతేకదా! పీఓకే లోనూ, పాకిస్తాన్ బోర్డర్ లోపల అనేక ఉగ్రవాదస్థావరాల్ని చితక్కొట్టి ఉగ్రవాదుల్ని పేల్చిపారేయడంతో ఆబ్జెక్టివ్ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత కొనసాగింపుగా అక్కడి ఆర్మీ రంగంలోకి దిగింది కాబట్టి మనవాళ్ళు జవాబు చెప్పాల్సి వచ్చింది. సీజ్ ఫైర్ అనుకున్నారుకాబట్టి ఆగింది.

అబ్బే..అలా ఆగకూడదు..ఆగడానికి వీల్లేదు..పీఓకే లాక్కున్నాకనే ఆపాలి..లాంటి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది ఎమోషనల్ ఫూల్స్. వాళ్ల ఎమోషన్ ని వాళ్లు దేశభక్తి అనుకుంటున్నారు కానీ అది నిజానికి అవివేకమే. దేశాల మధ్యన యుద్ధాలు కేవలం ఎమోషన్ తో జరగవు. ఒక కేలిక్యులేషన్ ఉంటుంది. ఎంత దెబ్బకి అంతటి తిరుగుదెబ్బ ఉంటుంది తప్ప ఊరికే మీదపడిపోయి కసిగా కొట్టేయడానికి ఉండదు.

మనలో చాలమంది ఏ టైపంటే..రోడ్డు మీద వెహికల్ ని పక్క వెహికల్ రాసుకుంటూ వెళ్తే మధ్యలో వెహికల్ ఆపేసి గొడవకి దిగి హీరోలా ఫీలవ్వడం. వెనకాల ఎంత ట్రాఫిక్ జాం అవుతోంది లాంటి కనీస సెన్స్ కూడా ఉండదు. మనం దిగామంటే అవతలవాడు వణికిపోవాలి అనుకునే పిచ్చి టెంపరమెంట్. మన దేశం, దేశాధినేత, ఆర్మీ అందరూ అలాగే బిహేవ్ చేయాలని కోరుకుంటారు ఇలాంటివాళ్లు. అసలు అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో కనీసమైన అంచనా ఉంటుందా వీళ్లకి?

1945లో తొలి అణుబాంబు భూమిమీద పడింది. హిఋఒషిమా మీద పడిన లిటిల్ బాయ్, నాగసాకి మీద పడిన ఫ్యాట్ మ్యాన్ అనేవి ఆ అణుబాంబుల పేర్లు. అంటే సరిగ్గా 80 ఏళ్లయ్యింది. ఈ 80 ఏళ్లల్లో ఏ దేశమూ మరో దేశం మీద అణ్వాయుధప్రయోగమే చేయలేదు. అందుకే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. టీవీలకి అతుక్కుపోయి ఎమోషనల్ గా ఊగిపోవడం తప్ప తెలుసుకుందామనే చొరవ కూడా ఉండదు.

ఆ 1945లో బాంబులతో పోలిస్తే ఇప్పుడు పాక్, ఇండియా వద్ద ఉన్న బాంబుల శక్తి 10 నుంచి 20 రెట్లు. లిటిల్ బాయ్ యొక్క యీల్డ్ సుమారు 15 కిలో టన్నుల టీ.ఎన్.టి అయితే, ఫ్యాట్ మ్యాన్ ది 21 కిలోటన్నుల టి.ఎన్.టి. ప్రస్తుతం ఇండియా-పాక్ వద్ద ఉన్న స్ట్రాటెజిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ యీల్డ్ 100-200 కిలోటన్నుల టి.ఎన్.టి. అంటే ఎన్ని రెట్లో లెక్కేసుకోండి. ఇలాంటివి రెండు దేశాల వద్ద చెరొక 170 వరకు ఉన్నాయని ఒక అంచనా.

ఇలాంటి బాంబు ఒక్కటి కనుక పడితే, నలుగైదు కిలోమీటర్ల రేడియస్సులో ఉన్న సమస్తం నిషానా లేకుండా ఆవిరైపోతుంది. ఆ తర్వాత కొన్ని పదుల కిలోమీటర్ల వరకు జనానికి థర్డ్ డిగ్రీ బర్న్స్ అయ్యి చనిపోతారు. ఆ తర్వాత మరో 5 కీలోమీటర్ల వరకు ఇళ్లు కూలిపోతాయి. ఆ తర్వాత గాలివాటాన్ని బట్టి 100 కిలోమీటర్ల పైవరకు రేడియేషన్ అయ్యి ప్రజలకి స్కిన్ కేన్సర్లు, లంగ్ కేన్సర్లు రావడంతో పాటూ గాలి, నేల కలుషితమైపోయి పంటలు కూడా పండవు. ఈ పరిస్థితి కొన్ని దశాబ్దాలపాటు ఉంటుంది. ఇలాంటివి 100 పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇంత చెప్పినా, అణ్వాయుధాలకి భయపడి యుద్ధం వద్దనాలా అని అడిగేవాళ్లున్నారు. అవును. అణ్వాయుధాలు ప్రపంచంలో ఉన్నదే యుద్ధాలు ఆపడానికి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మీద వేస్తే ఇండియా ఒక్కటే కాదు, ఇంపాక్ట్ 100 కిలోమీటర్ల పైబడి ఉంటుంది కనుక పడిన ప్రాంతాన్ని బట్టి పాకిస్తాన్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా పరిస్థితి కూడా అంతే. అసలే పాకిస్తాన్ చిన్నది. ఎక్కడ వేసినా, ఇండియా బార్డర్ దాటి దాని ప్రభావం ఇటువైపుకూడా పడుతుంది. కనుక ఎవరు పేల్చినా దాని గాలి ఇరువర్గాలూ పీల్చాలి, పర్యవసానాలు అనుభవించాలి.

సీజ్ ఫైర్ తో యుద్ధం ఆగింది అన్న వార్త రాగానే సోమవారం నాడు సెన్సెక్స్ ఉరకలు వేసింది. అసలు స్టాక్ మార్కెట్ల మీద అవగాహనలేని వాళ్లు, ఎకానమీ గురించి అర్ధం కాని వాళ్లు, నిత్య అసంతృప్తి పరులు, అర్ధం లేని ఎమోషన్ ని దేశభక్తి అనుకునేవాళ్లు అంధత్వంతో యుద్ధం కోరుకుంటున్నారు. ట్రంప్ తన ట్వీటులో రెండు దేశాలు “కామన్ సెన్స్” “గ్రేట్ ఇంటిలిజెన్స్” వాడి సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాయి అని అనడంలో ఆంతర్యం ఇది కూడా.

సరే..మరి యుద్ధం చేయకుండా శాంతి ఎలా?

టెర్రరిజం పోతే శాంతి వస్తుంది. అది పోవాలంటే పాకిస్తాన్ ఆర్మీ దానికి వెన్నుదన్ను ఇవ్వడం ఆపాలి. అలా ఆపాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. ఆపకపోతే సర్జెకిల్ స్ట్రైక్స్ లాంటివి చేసుకుంటూ ఆ టెర్రరిస్ట్ స్థావరాల్ని మనమే లేపుతుండాలి. ఏం చేసినా పూర్తి స్థాయి వార్ అవ్వకుండా, అక్కడి సామాన్య ప్రజలకి దెబ్బ తగలకుండా టెర్రరిస్టులమీదే దృష్టి పెట్టి కూంబింగ్ చేయాలి. ఆమాత్రం “రా” వ్యవస్థని ఇంకా పటిష్టం చేసుకోవాలి. ఇండియాలో ఒక్క టెర్రరిస్ట్ క్యాంపూ లేదు. ఉన్నవన్నీ పాకిస్తానులోనే. అది పాకిస్తానుతో సహా లోకం మొత్తానికి తెలుసు.

టెర్రరిస్టుల లక్ష్యం ఇండియాని దెబ్బతీయడం, పాకిస్తాన్ ని తమ గ్రిప్పులో ఉంచుకోవడం. వాళ్లకి సహకరించకపోతే పాకిస్తాన్ ప్రధానినైనా లేపేస్తారు, ఆర్మీ అధికారుల్నైనా లేపేస్తారు. అలాంటి బలహీనమైన స్థితిలో అక్కడి వ్యవస్థలున్నాయి. దాంట్లో మార్పు తీసుకురాగిలిగే విధంగా భారత్ చక్రం తిప్పగలగాలి. ఎంత శత్రుదేశమైనా పక్కనే ఉన్న దేశం. నిజానికి ఉగ్రవాదం తప్ప ఆ దేశంతొ ఇండియాకి సమస్యే లేదు. క్రికెట్టు, బాలీవుడ్డు కామన్. కర్తార్ పూర్ కారిడార్ వల్ల ఇరుదేశాల మధ్య చిన్నపాటి టూరిజం కూడా నడుస్తోంది. వాఘా బార్డర్లో మిలిటరీ కవాతులు కూడా టూరిజంలో భాగమయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ తో మైత్రికోసమే మొదటి అడుగువేసారు నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న కాలంలో. అయినా కేవలం ఉగ్రవాదం, దానికి గతిలేక వెన్నుకాసే ఆర్మీ వల్ల రాజకీయం వేడెక్కుతూ వచ్చింది. అందుకే, యుద్ధం కాకుండా చాలా తెలివిగా ఇంకేదో చెయ్యాలి. నిజానికి మోదీ ప్రభుత్వం చేసింది. పాకిస్తాన్ ని ఆర్ధికంగా కృంగదీసి, అప్పుకోసం ప్రపంచమంతా అడుక్కుతినేలా చేసింది. కానీ అది సరిపోలేదు. దాంతో ఆ దేశంలో మార్పు రాలేదు. దెబ్బతిన్న పాములాగ ఇంకాస్త పగ పెంచుకుంది. కనుక చక్రం వేరే విధంగా కూడా తిప్పాలేమో. ఇక్కడ కూర్చుని పాకిస్తాన్లో రాజకీయాన్ని, ఉగ్రవాద నాయకుల్ని ప్రభావితం చేయగలగాలి. గూఢచర్య వ్యవస్థ, అండర్ కవర్ బ్యాచ్ పెరగాలి. టార్గెట్ ఉగ్రవాదులు, వాళ్లకి వెన్నుకాసేవాళ్లే కావాలి. అవన్నీ చెయ్యాలంటే ఓవర్ టు అజిత్ దోవల్, జయశంకర్!!

హరగోపాల్ సూరపనేని

46 Replies to “నేటి అణుబాంబు పడితే ఎఫెక్ట్ ఇలా ఉంటుంది”

  1. ఇస్లామ్ టార్గెట్ ప్రపంచం మొత్తాన్ని ముస్లిం మెజారిటీ గా మార్చి, షరియా లా పెట్టీ 

    మగాళ్ళకి దాన్ని సగం కత్తిరించి ,

     ఆడోళ్లకి హిజాబ్ వేయించడం.

    దానికి వాళ్ళు ఎన్నుకున్న ఎదురులేని ఎవడు కూడా వద్దు అనలేని రాజా మార్గం జనాభా పెరుగుదల. 

    ఆ పుస్తకం వినత కాలం, ఇలాంటి పాకిస్తాన్ ము పుడుతూనే వుంటారు.  కేవలం 70 ఏళ్ల లో రెండు ముస్లిం దేశాలు ఎలా పుట్టాయి?  మతం పేరుతో విడిపోయి కూడా, ఇంకా ఇండియాయ్ కూడా వాళ్ళకే కావాలి అంటున్నారు 

  2. మీ చుట్టూ పక్కల ముస్లిం లో జనాభా గత పాతికేళ్లు లో ఎలా పెరిగించదో చూడండి. వాళ్ళ ఆలోచనలు ఎలా మారాయో చూడండి. 

    వాళ్ళు బయట పడిరి కానీ, 99 శాతం మందికి అల్లా కోరిక ప్రకారం ఇండియా ముస్లిం దేశం కావాలి అని బాగా కోరిక.

    1. అమెరికా లో 5 శాతం ఇప్పటికే ముస్లిం లో జనాభా పెరిగింది. ఒక్కడూ కనీసం ఒక పది మందిన్ని కనేసి దేశం మీదకి వదలడం, వాళ్ళని అమెరికా వాళ్ళ పన్ను డబ్బుతో ఫ్రీ గా మేపడం

  3. ఇస్లాం సరిగా ఫాలో కాకుండ్ వున్న చెడ్డ ముస్లిం ల వలనే మిగతా వాళ్ళు ప్రశాంతం గా ఉన్నారు 

    వాళ్ళు కూడా ఆ పుస్తకం లో అక్షరం తూచా తప్పకుండా పాటిస్తే, ఖతం

  4. యుద్ధం ఆపేసినందుకు మోడీని తిట్టిపొస్తున్నారు. Ok. మీ సరదా కోసం మోడీ యుద్ధం చేస్తాడు. యుదం మూలంగా డబ్బులు ఖర్చు అయ్యి ధరలు పెరుగుతాయి. ఓకే యేనా

    ఆస్తులు ధ్వంసం అవుతాయి ఫర్వాలేదా?

    జనం చస్తారు డోంట్ వర్రీ అంటారా?

    చస్తే అనరు

    ధరలు పెరిగినందుకు జనం చచ్చినందుకు ఈ జనమే మళ్ళీ మోడీని తిట్టిపోస్తారు.

    చచ్చేది సరిహద్దులలో జనం కాబట్టి వెంటనే షాక్ కొట్టటం లేదు. రేపు నష్టాలు పూడ్చుకోవటానికి టాక్స్లు పెరిగి ధరలు పెరిగి, అప్పుడు జనానికి అసలు షాక్ తగిలి, తిట్లు లంకించుకుంటారు.

    ఒకడు POK ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని కోప్పడుతాడు. దేశం నాశనం చేస్తానికి , రోజూ జరిపే అల్లర్లుకు ఇప్పుడున్న వాళ్ళు చాలాలేదా POK వాళ్ళు కూడా చేరి తగలబెట్టటానికి.

    బెలూచిస్తాన్ ను విడదీస్తే అది రేపు మరో బాంగ్లాదేశ్ అవదని గారంటి ఉన్నదా? ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్ బాంగ్లాదేశ్ తోనే సమస్యలు. రేపు పాకిస్తాన్ బాంగ్లాదేశ్ లతో పాటు POK బెలూచిస్థాన్ లతో కూడా సమస్యలే.

    ఇప్పటికే పాలు పోస్తున్న పాములు చాలు. కొత్తవి ఎందుకు?

    పాకిస్తాన్ ఆయువుపట్ల మీద తేరుకొకుండా కొట్టాము. చైనా ఆయుధాల పరువు తీసాము

    నా వరకూ అంతవరకూ చాలు

    1. అందుకే POK మనకు వద్దు. ఇక్కడ ఇప్పటికే ఉన్నవాళ్లు చాలు. కొత్తగా POK వాళ్ళు మన నెత్తిన దేనికి? బెలూచ్ ను విడదీస్తే రేపు అది మనకు మరొక బాంగ్లాదేశ్ లాగా తయారు అవుతుంది. POK, బెలూచ్ పాకిస్తాన్ లోనే ఉండాలి. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు. విడిపోతానికి సాయం చేస్తే POK బెలూచిస్తాన్ పాకిస్తాన్ ముగ్గురూ కలసి మనను పీక్కు తింటారు. బాంగ్లాదేశ్ కు పాలు పోసాము. ఇప్పుడు విషం కక్కుతున్నది. రేపు POK అయినా బెలూచిస్తాన్ అయినా అంతే.

    2. అణు యుద్ధం చేయమని ఎవరు అడగలేదు ,వాళ్లు అది వేస్తారు కాబట్టి మనవాళ్ళని వాళ్ళు ఏమి చేసిన వాళ్ళని ఏమి అనకూడదు అంటే ఎలా ? మన దేశ సార్వభౌమత్వాన్ని ఎవరు కాపాడతారు ? ఎంతకాలం ఇలా అమాయకులని ఉగ్ర దాడికి బలి చేస్తారు

    3. అయితే యుద్ధం వొద్దు అలాగే ప్రజలమీద పన్నులు కూడా వొద్దు , అసలు ఈ రాజకీయనాకులు కూడా వొద్దు వాళ్ళు ఇంతకాలం ప్రేత్యేక విమానాల్లో తిరిగి సాధించింది ఏమి లేదు , అమాయక ప్రజల ప్రాణాలు కాపాడలేనప్పుడు వాళ్లకి రాజకీయాలు ఎందుకు ? పేదలకి , అమాయకులకు రక్షణ లేనప్పుడు ప్రేత్యేక విమానాలు , అత్యాధునిక రక్షణ రాజకీయనాయకులకు మాత్రమే ఎందుకు ??

    4. బ్రదర్.. చాలా సెన్సిబుల్ గా రాశారు. యుద్ధం పర్యవసానాలు చాలామందికి తెలియకపోవచ్చు, అందులోనూ న్యూక్లియర్ వార్ అంటే తమాషా కాదు, అటు వైపు దివాలా తీసి, తాము పూర్తిగా నాశనం ఐనా పర్వాలేదు అని తెగించిన దేశం, మనం అలా కాదుగా, ఇటుక మీద ఇటుక పెర్చుకుంటూ ఎదుగుతున్న దేశం. ప్రభుత్వం చాలా బాగా హ్యాండిల్ చేశారు, ఒక్కటే అసంతృప్తి ఎంటంటే, కాల్పుల విరమణ ప్రకటన వాడెవడో పిచ్చి తుగ్లక్ గాడు చేయడం, దానిని మన వాళ్లు ఖండించాల్సింది.

    5. POK, బెలూచిస్తాన్ విషయంలో కూడా కరెక్ట్ గా రాశారు.. POK ని కలుసుకోవడమంటే మరో రావణకాష్టాన్ని నెత్తిన పెట్టుకోవడమే, వాళ్ల దారిద్ర్యం, నిరుద్యోగం, శాంతి భద్రతలు, రక్షణ ఖర్చులు మనమే భరించాలి. వాళ్లని కలుపుకుని పాకిస్తాన్ మాత్రం బాగుపడిందేమీ లేదు, ఉగ్రవాదుల స్థావరాలు నడిపి మన మీద పగతీర్చుకోవడం తప్ప.

    6. నీలాంటి వాళ్ళ వల్లనే పనికిమాలిన దేశాలు కూడా పోరాడి రక్తం చిందించి మనకంటే వంద ఏళ్ళ ముందరే స్వాతంత్య్రం సంపాదించుకున్నాయి. 

      1. Yuddam aapamani evarini evaru request chesaaru  yousuf khan. mee vaalla naddi virigettu tanneppatiki neeku burralo pancture padi natlu unnadi. pakkane mee vaalla punctre shop lo puncture veyinchuko

  5. అణు యుద్ధం చేయమని ఎవరు అడగలేదు ,వాళ్లు అది వేస్తారు కాబట్టి మనవాళ్ళని వాళ్ళు ఏమి చేసిన వాళ్ళని ఏమి అనకూడదు అంటే ఎలా ? మన దేశ సార్వభౌమత్వాన్ని ఎవరు కాపాడతారు ? ఎంతకాలం ఇలా అమాయకులని ఉగ్ర దాడికి బలి చేస్తారు

    1. mana army vallu ichina updates ni nuvvu follow ayunte ee maatalu maatladavu … already terrorist camps ni stike chesaamu … jaishe lo main people kuda chachaaru ….  pak army counter attack cheste strong ga defend chesaam, Inkem expect chestunaavo nuvvu.

  6. ఇస్లాం కిలాప్జాత్ అనేది, మిగతా జనాల డెమోక్రసీ, సెక్యులర్, సోషలిస్ట్ అనే ఆలోచలకి వ్యతిరేకం.

    ఒక్కసారి ఇస్లాం జనాభా పెరిగి అక్కడ షరియా చట్టం వచ్చిందా , అక్కడి మిగతా మతాల వాళ్ళు చచ్చినట్లు లెక్క.

    డెమోక్రసీ, సెక్యులర్ అనే ఆలోచనల నీ ఆసరాగా పెట్టుకుని, వాళ్ళు తమ ఇస్లాం మతాన్నీ విపరీతంగా పెంచుకుంటారు. ఒక్కసారి వాళ్ళు అక్కడ మెజారిటీ అవ్వగానే ( 100 అవసరం లేదు, కనీసం 15 శాతం చాలు), ఆ ప్రాంతాల్లో మిగతా మతాల వారిని బతకనివ్వరు.

    పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో, కశ్మీర్ నేరుగా చూస్తున్నాం.  అక్కడి హిందువుల, క్రైస్తవుల, సిక్కుల సంఖ్య ఎంత తగ్గిపోయింది అని.

    మంచి మనుషులని కూడా టెర్రరిస్టులిగా మార్చే  ఆలోచనల కారణం ఆ ఒక్క పుస్తకం.

    వాళ్ళని ద్వేషం చేయమని అనడం లేదు, మీరు నిజాన్ని తెలుసుకుని ధైర్యం గా నిజాలను చెప్పడం మొదలుపెట్టింది.

    1. ఆఖరికి మనం ఆహారం కోసం చంపే గొర్రె , మేక, కోడి లని కూడా బాధ  లేకుండా లేక తక్కువ బాధ తో జట్కా పద్దతి లో చంపకుండా , 

      వాటి మెడ నరం కోసి, ఆ మూగ జీవాలు తమ రక్తం ఒక్కో బొట్టు కారుతూ వుంటే ఆ నరక యాతన పెడుతూ హలాల్ పేరుతో చంపే శాడిస్ట్ పద్దతి చెప్పిన వాడు దేముడు అవుతాడ ? 

  7. మీరు చెప్పే దాన్ని బట్టి అన్వాయుధాలు ఉన్న దేశాలు అన్వాయుధాలు లేని దేశాలతోనే యుద్ధాలు చేయాలంటారు. అణ్వాయుధాలు లేని దేశాలని ఏమి చేసిన అవి అన్ని మూసుకొని ఉండాలంటారు. వాట్ ఐస్ ఠిస్ మాష్టారు? యు అర్ అవుట్ డేటెడ్.

    1. యుద్ధం కాదు, nuclear usage గురించి ఈ వాక్య ప్రస్తావన.

      ఉక్రైన్ అవి లేవు కాబట్టి రష్యా వాటి ప్రయోగం చెయ్యలేదు అని

  8. Nothing wrong did now.. things is about who is asking why not captured before 1947,1971 et.c., why country divided, why they released 1lakh pak army like this foolish things. 

  9. ha ha ….భారత్ తాము కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం  చేసుకుడానికి ప్రయటనుస్తుంటే  అక్కడ అణ్వాయుధం ఎందుకుప్రయోగిస్తాదో ఈ వ్యాస రచయతకి తెలియాలి…..దేశం కోసం మానవాళి కోసం ఆలోచించేవాళ్ళు ఇంతకన్నా ఎక్కువగా ఆలోచి స్తారని తట్టలేదా

  10. నా మతం లో నుండి బయటకి వెళ్ళిన వాళ్ళని చంపండి.

    నన్ను నమ్మని ఖాపిర్ లను చంపండి.

    ఆడ వాళ్ళకి హిజాబ్ వెయ్యండి. 

    మీ బానిసగా ఉంచండి.

    మీకు నా స్వర్గం లో సీటు ఖాయం.

    ఈ మాటలు చెప్పే వాళ్ళని పోలీసు స్టేషన్ లో కేసి పెడితే, ఉరి శిక్ష వేస్తారు కోర్టు వాళ్ళు.

    కానీ మనం దాన్ని గౌరవించండి అని చెబుతున్నాం.

    ఆ పుస్తకం వున్నంత వరకు, ఇలాంటి దాడులు జరుగుతు7నే ఉంటాయి,, ఇంకో  100 యేళ్ళు తర్వాత కూడా. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లాంటి దేశాలు పుడుతూనే ఉంటాయి. అదో కాన్సర్ లాంటి ఆలోచన , మానవ జాతి కు.

  11. POK ni kalupukovadam ante .. akadi jaanalu andharikee repu aadhaar ichi indian citizens cheyaali … official ga india lo ye moolaku inaa vellochu … aa musugu lo entha mandhi terrorists india motham spread avtaaro aalochisthe … emotions motions annee control avtaayi.

      1. asalu badhulu kosaru pattukoni vaadistunaav … evaru baabu nuvvu … intha talented ga unaavu.

        Aadhaar ane peru vinte ne oogipoyaav ante … nee moolaalu ento ardham avtundhi.

  12. కత్తి మొన చూపించో, అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే.. మనల్ని అణచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోనే సమాధానమివ్వడం!

                                                                                             – లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మాజీ ప్రధాని

  13. Security lapse enduku annadi answer cheyakunda war cheyadam ante just diversion. 2005-2014 many attacks happened and they were a mistake of UPA. They took a long time to invest and improve on internal security. Similarly this one is a mistake of kootami. They need to correct lapses. Instead of that they are trying all sort of gimmicks now.

  14. Without answering questions on security lapse they are trying diversions now. 2005-2014 many attacks happened and they were a big mistake of UPA. They took a long time to invest and improve on internal security. Similarly this one is a mistake of kootami. They need to correct lapses. Instead of that they are trying all sort of gimmicks now.

  15. Without answering questions on security lapse they are trying diversions now. 2005-2014 many attacks happened and they were a big mistake of UPA. They took a long time to invest and improve on internal security. Similarly this one is a mistake of kootami. They need to correct lapses. Instead of that they are trying all sort of diversions now.

  16. Without answering questions on security lapse they are trying diversions now. 2005-2014 many lapses happened and they were a big mistake of UPA. They took a long time to invest and improve on internal security. Similarly this one is a mistake of kootami. They need to correct lapses. Instead of that they are trying all sort of diversions now.

  17. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరు గెలిచినా గెలిచిన దేశానికి కూడా నష్టం జరగకుండా ఉండదు…

    యుద్ధం లో గెలవడం ఎంత ముఖ్యమో ప్రాణనష్టం ఆపడం కూడా అంతే ముఖ్యం

    ఇద్దరి మధ్యలో బలయ్యేది సైనికులు, సామాన్య ప్రజలే, కానీ యుద్ధం మొదలు పెట్టిన రాజకీయ నాయకులు కాదు

    ఉదాహరణకి మనమందరం సానుభూతి చూపించే జిలెన్స్కీకూడా వ్యక్తిగతంగా కోల్పోయిందేమి లేదు. ఇన్నేళ్ల యుద్ధంలో చనిపోయింది యుక్రెయిన్ రష్యా సైనికులు, ప్రజలు మాత్రమే…

  18. యుద్ధం అంటూ జరిగితే .. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం ఎలాంటిదైనా వినాశనమే. అందులో విజేతలు సాంకేతికంగా ఉంటారు కానీ.. యుద్ధం చేసిన వారంతా నష్టపోతారు. దానికి తాజా సాక్ష్యం రష్యా, ఉక్రెయిన్ మాత్రమే.

    .

    లక్షల మంది సైన్యాన్ని ఈ రెండు దేశాలు కోల్పోయాయి. పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బందులు పట్టారు. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయిపోయింది. రష్యా పెద్ద ఎత్తున సైనిక, ఆర్థిక నష్టాలను చవి చూసింది. ఇప్పటికీ అనుకున్న విజయాన్ని పొందలేకపోయింది. రేపు రష్యా విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవచ్చు కానీ.. జరిగిన నష్టాన్ని మాత్రం ఎప్పటికీ భర్తీ చేసుకోలేదు. సగటు భారతీయునిగా అలాంటి విజేతగా భారత్ ఉండాలని కోరుకోలేం.

    పాకిస్తాన్ ఖచ్చితంగా పాపిస్తాన్ . ఆ విషయంలో మరో డౌట్ లేదు. ఆ దేశంలో సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశాన్ని బలహీనం చేయాలి.

Comments are closed.