బోయపాటి వెర్సస్ బాలయ్య!

బాలయ్యకు బోయపాటికి మధ్య కాస్త ఇగో క్లాష్ నడుస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

అఖండ 2.. చకచకా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ కు ఏ ఇబ్బందిలేదు. కానీ షూట్ టైమ్ లో అక్కడ వున్న వారికి మాత్రం అగ్నిపర్వతం దగ్గరలో కూర్చున్నట్లు వుంటోందట. ఏ క్షణం పేలుతుందో అని అనుమానం. ఎందుకంటే బాలయ్యకు బోయపాటికి మధ్య కాస్త ఇగో క్లాష్ నడుస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇది ఇప్పుడు కాదు, ప్రాజెక్ట్ ఆరంభం నుంచి మొదలైందని టాక్.

బోయపాటికి తనే కదా బాలయ్యకు సింహా, లెజెండ్, అఖండ ఇచ్చాను అనే ఫీలింగ్ వుండి వుండొచ్చు. బాలయ్యకు అప్పటి సంగతి వేరు. ఇప్పుడు అన్నీ హిట్ ల మీద హిట్ లు కొడుతున్నా అని వుండొచ్చు. మొత్తం మీద ఇద్దరి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకటి రెండు సార్లు బాలయ్య కాస్త గట్టిగానే మాట్లాడారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. అయితే ఇవేమీ సినిమాకు అడ్డం పడడం లేదు. మరో హీరో అయితే ఎలా వుండేదో? కానీ బాలయ్య పద్దతి వేరు. సినిమా సినిమానే. వ్యవహారం వ్యవహారమే.

ఈ మధ్య సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఆయుధం తయారుచేయించారట బోయపాటి. తెలిసిందే కదా, బోయపాటి చిత్ర విచిత్రమైన ఆయుధాలు తయారు చేయించి, తన సినిమాలో హీరోల చేత వాడిస్తుంటారు. అఖండ 2 కోసం ఓ చిత్రమైన గద ను తయారుచేయించారట. ఆ గద కు పైన త్రిశూలం ఫిక్స్ చేయించారట.

ఈ గద ను చూసి, ఫుల్ గా పౌరాణికాల నాలెడ్జ్ వున్న బాలయ్య.. ఇది గదా.. ఇలా వుంటుందా ఎక్కడైనా అని అడిగారట. ఇక్కడ ఇలాగే వుంటుందని బోయపాటి ఆన్సర్ ఇచ్చారట. ఇలా ముభావంగా ముచ్చట్లు ఆడెసుకుంటూనే షూటింగ్ కానిచ్చేస్తున్నారట.

వారిద్దరు బాగానే వున్నారు. కానీ సెట్ లో చుట్టూరా వున్న వాళ్లే ఏ క్షణం ఏ ఉరుము ఉరుముతుందో అని భయం భయంగా పని చేస్తున్నారట.

9 Replies to “బోయపాటి వెర్సస్ బాలయ్య!”

  1. బాలయ్య బాబు తో పెట్టుకునేంత సీను బోయపాటి బ్రో కి లేదు కానీ నువ్వు లైట్ తీస్కో

  2. గాసోడు ఒక నైటీ ఏసుకొని ఎవరు పిత్తుతున్నారో, ఎవరు దొడ్డికి పోయినారో లెక్కలు ఏసుకుంటా ఉంటాడేమో.. అన్నీ గాలి వార్తలు రాసుకుంటా బతికేస్తున్నాడు

  3. GA నువ్వు టీడీపీ, బీజేపీ ,   జనసేన మధ్య బొక్కలు పెడతావని తెలుసు, చివర ఆఖరికి సినిమా మీద కూడా పడ్డావా?

Comments are closed.