టాలీవుడ్ లో గుసగుసలకు లోటు వుండదు. అందునా కోట్ల వ్యవహారం..విజయానికి, అపజయానికి, కెరీర్ తారా జువ్వలా ఎగరడానికి లేదా నేల రాలిపోవడానికి ఒక్క సినిమా చాలు..అది హీరోకైనా, నిర్మాతకైనా, దర్శకుడికైనా. అందుకే ఇక్కడ అలవాట్లు ఎక్కువ..ఫ్రస్టేషన్లు ఎక్కువ.
అలాంటి ఫ్రస్టేషన్ లోనే ఓ దర్శకుడు తన భార్యపై చేయి చేసుకున్నాడని, దాంతో ఆమె పెద్దలకు ఫిర్యాదుచేసిందని గుసగుస వినిపిస్తోంది. పైగా వారిది ప్రేమ వివాహం కావడంతో, పెద్దలు సర్ది చెబుతున్నారట.
ఈ సర్దుబాట్ల సంగతి ఎలా వున్నా, ఇది నిజమేనా..మీకు తెలుసా అంటూనే ఒకరి నుంచి మరొకరికి పాకుతోంది టాలీవుడ్ లో ఈ వందంతి కమ్ వార్త. టాలీవుడ్ ఇన్ సైడ్ వ్యవహారాలపై, పాఠకులకు, బయట జనాల కన్నా, టాలీవుడ్ లో వున్నవారికే ఆసక్తి మరీ ఎక్కువ.