చిన్న చిన్న పాత్రలకు తనను వాడుకుంటూ, సినిమాలకు తనను ప్లస్ చేసుకుంటూ తనకు మాత్రం ఉపయోగపడని పాత్రలపై కమెడియన్ సప్తగిరి పునరాలోంచడం ప్రారంభించాడు. ఇప్పుడు కాస్త నిడివి ఎక్కవ వున్న పాత్రలపై దృష్టి పెట్టాడు. సప్తగిరి రేటు, దాని వల్ల వచ్చిన తక్కువ నిడివి గల పాత్రల గురించి ఐటమ్ లు రావడంతో ఇప్పుడు తన లైన్ మార్చాలని డిసైడ్ అయినట్ల బోగట్టా.
చిన్నదైనా, పెద్దదైనా పాత్ర తీరు తెన్నులు కీలకంగా వుండాలని అనుకుంటున్నాడు. అయితే ఇండస్ట్రీలో మరీ పాత్ర, స్వభావం స్వరూపం అడిగితే, ఎగా దిగా చూసే జనాలే ఎక్కువ. అందుకే కాస్త అటు ఇటుగా వెళ్లాలనుకుంటన్నాడట. ఇప్పుడు యువి క్రియేషన్స్-శర్వానంద్, రామ్ చరణ్-శ్రీనువైట్ల, దిల్ రాజు-సునీల్, మరో రెండు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నాడట. వీటితో తన కెరీర్ మరింత పుంజుకుంటుందని అనుకుంటున్నాడు సప్తగిరి.