మొత్తానికి ఎన్టీఆర్ సాధించాడు

కొరటాలశివ..మైత్రీ మూవీస్..ఎన్టీఆర్ సినిమా అనుకున్నట్లుగానే ప్రారంభమైంది. వుంటుందా..వుండదా..అని ఊగిసలాడింది..శివ వేరే సినిమా చేయాలన్న ఆలోచనలో వున్నాడన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కిందామీదా పెట్టి మరీ ఓకే చేయించుకున్నాడు శివ చేత అని గ్యాసిప్ లు…

కొరటాలశివ..మైత్రీ మూవీస్..ఎన్టీఆర్ సినిమా అనుకున్నట్లుగానే ప్రారంభమైంది. వుంటుందా..వుండదా..అని ఊగిసలాడింది..శివ వేరే సినిమా చేయాలన్న ఆలోచనలో వున్నాడన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కిందామీదా పెట్టి మరీ ఓకే చేయించుకున్నాడు శివ చేత అని గ్యాసిప్ లు వినిపించాయి.

మొత్తానికి ఏమయితేనేం..ముహుర్తం జరిగిపోయింది. అంతకుముందు నిర్మాత బండ్ల గణేష్ కు కొరటాల శివ తను తరువాత సినిమా అంటే నాలుగో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. నిజానికి రెండోసినిమా చేయాల్సి వుంది. కాలేదు..

మూడోది అఖిల్ కాంబినేషన్ లో చేయించాలని బండ్ల తాపత్రయపడ్డాడు. కానీ ఎన్టీఆర్ పట్టుదల వల్ల సాధ్యం కాలేదు. నాలుగో సినిమా చేస్తానని, కోపరేట్ చేయమని శివ అడగడం, బండ్ల ఓకె అనడం జరిగింది. దీంతో ఎన్టీఆర్-శివ కాంబినేషన్ లో సినిమాకు క్లాప్ కొట్టసారు.