మెగా స్టామినా ఇంతేనా?

చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి తెరమీద కనిపించారు..జనం బళ్లు కట్టుకు వచ్చే రేంజ్ లో వుంటుందేమో అనుకుంటే, పరిస్థితి పూర్తిగా రివర్స్ లో వుంది. దసరాతో కలుపుకున్నా కూడా వసూళ్లు ముప్పై కోట్ల…

చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి తెరమీద కనిపించారు..జనం బళ్లు కట్టుకు వచ్చే రేంజ్ లో వుంటుందేమో అనుకుంటే, పరిస్థితి పూర్తిగా రివర్స్ లో వుంది. దసరాతో కలుపుకున్నా కూడా వసూళ్లు ముప్పై కోట్ల కి అటు ఇటు గా వచ్చాయి. థియేటర్లలో మరో వారం వరకు తీయడం వుండదు..సరైన సినిమా కూడా ఏమీ లేదు కానీ, మెగాభిమానులకు వరుణ్ తేజ నటించిన కంచె ఆప్షన్ గా వుంది.

రిపీట్ ఆడియన్స్ కాకున్నా ఓ సారి చూసే అవకాశం వుంది. పైగా వాణిజ్యపరంగా కాకున్నా, మంచి సినిమా అన్న టాక్ సర్వత్రా స్ప్రెడ్ అయింది. అటుపక్క బన్నీ, ఇటుపక్క వరుణ్ ఇలా, మెగా హీరోలే పోటీగా మారారు చరణ్ సినిమాకు. మరి అలా అలా ముఫై ఐదు కోట్లు దాటుతుందేమో? సినిమాకు అయిన ఖర్చుతో చూసుకుంటే యాభై శాతానికి పైగా బయ్యర్లు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.