నందమూరి కుటుంబంలో సయోధ్య?

చాన్నాళ్ల తరువాత నందమూరి అభిమానులు ఆనందించే వార్త ఒకటి షికారు చేస్తోంది. బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇలా ఫ్యామిలీ అంతా ఒక్కటిగా కలిసే విధంగా చర్యలు, చర్చలు జరుగుతున్నాయని వినికిడ. …

చాన్నాళ్ల తరువాత నందమూరి అభిమానులు ఆనందించే వార్త ఒకటి షికారు చేస్తోంది. బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇలా ఫ్యామిలీ అంతా ఒక్కటిగా కలిసే విధంగా చర్యలు, చర్చలు జరుగుతున్నాయని వినికిడ. 

గడచిన కొంత కాలంగా హరికృష్ణ కుటుంబం, బాలయ్య కుటుంబం ఎడమొహం, పెడమొహంగా వుంటున్నాయన్నది ప్రచారంలో వుంది దానికి దగ్గట్టే ఫంక్షన్లు జరుగుతున్నాయి. అబ్బాయిలు బాబాయ్య నామ జపం చేస్తున్నా, ఆయన మాత్రం కనికరించడం లేదు.

కేరీర్ పరంగా ఎన్టీఆర్ కాస్త ఒడిదుడుకుల్లోనే వున్నాడు. లోకేష్ తో సరిపడక, బాలయ్య కు దూరమయ్యాడని, ఎన్నికల ముందు జగన్ వైపు మొగ్గాడని ఇలా చాలా వార్తలు వదంతులు వున్నాయి. తరువాత తరువాత, ఎన్టీఆర్ రాజీ సూచనలు పంపినా బాలయ్య కరుణించలేదని టాలీవుడ్ లో వార్తలు తరచు వినిపిస్తుంటాయి. 

అయితే తాజాగా అబ్బాయిలను దగ్గరకు తీసేందుకు బాబాయ్ కాస్త సుముఖత వ్యక్తం చేసారన్న వదంతి వినిపిస్తోంది. ఈ మేరకు మధ్యవర్తిత్వాలు కొంత వరకు ఫలించాయంటున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పార్టీ పరమైన సమావేశంలో బావ చంద్రబాబును కలిసారు. వారిద్దరు బాగానే మాట్లాడుకున్నారు. చంద్రబాబు కూడా అందర్నీ కలుపుకుని పోవాలనే అనుకుంటున్నారు. 

గతంలో లోకేష్ కూడా కొంతవరకు సరే అన్నారని వార్తలువినిపించాయిు. ఇప్పుడు అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా ఇంకా తెలియదు. అంది వుంటే, ఈ అవకాశాన్ని వాడుకుంటారా? బాబాయ్ కు దగ్గరవుతాడా? అన్నది ఇప్పుడు తెలియాలి. అన్నీ అనుకున్నట్లు జరిగి, రాజీ చర్చలు ఫలించి, ఎన్టీఆర్ మళ్లీ తెలుగుదేశానికి దగ్గరైతే, అతని కెరీర్ ఓ రేంజ్ లో వుంటుదన్నది నందమూరి అభిమానుల మాట. 

అయితే ఇక్కడ మరో విషయం కూడా వినిపిస్తోంది. బాలయ్య మనవడి అన్నప్రాశన కార్యక్రమానికి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ వెళ్లారని, ఎన్టీఆర్ మాత్రం రాలేదని, ఊరిలో వుండి రాకపోవడం సరికాదన్నది ఆ మాట. అయితే అసలు ఎన్టీఆర్ ను పిలచారా లేదా అన్నది ఓ అనుమానం. ఏమైనా, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సయోధ్య దిశగానే ప్రయనిస్తున్నారు.వారితో పాటే ఏన్టీఆరూనూ.