విక్రమ్ కే కుమార్-నాగ్ చైతన్య కాంబినేషన్ లో తయారైన వెబ్ సిరీస్ దూత. ఇవ్వాళ నిన్నటి ప్రాజెక్ట్ కాదు. చాలా కాలం ముందుగానే మొదలైంది. కానీ విక్రమ్ కే కుమార్ వేరే పనులతో వుండడంతో, చైతన్య కు కూడా సినిమాలు వుండడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది.
నాగ్ చైతన్య తొలిసారి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లోకి నేరుగా వెళ్లడం దీనితోనే. అలాగే విక్రమ్ కే కుమార్ కు కూడా. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద కాస్త ఆసక్తి కలిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత కూడా రకరకాల టెక్నికల్ రీజన్ల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా ఓటిటి సంస్థలతో కలిసి వర్క్ చేయడం అంటే అంత సులువు కాదు. అడుగు అడుగునా అకౌంటబులిటీ, రూల్స్, రెగ్యులేషన్లు వుంటాయి. అన్నీ చూసుకుంటూ మొత్తానికి దీన్ని పూర్తి చేసారు.
అమెజాన్ లో ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 విడుదలవుతుందని తెలుస్తోంది. ఎనిమిది ఎపిసోడ్ లు, ఒక్కొక్కటి 40 నిమిషాలు వుంటుంది. మాంచి స్టార్ కాస్ట్ తో, ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ వెబ్ సిరీస్ ను శరద్ మరార్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ కోసం చైతూ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది క్లిక్ అయితే మరి కొన్ని మంచి క్వాలిటీ వెబ్ సిరిస్ లు తెలుగు నుంచి వచ్చే అవకాశం వుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో చాలా వరకు చౌకబారు అడల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లే ఎక్కువ.