బాహుబలికి భారీ అడ్వాన్స్ లు

బాహుబలి సినిమా సన్నాహాలు మొదలైపోయాయి. బయ్యర్లు ఫిక్సయిపోయారు కాబట్టి, థియేటర్ల బుకింగ్ లు జోరందుకున్నాయి. దాదాపు తొంభై అయిదు శాతం థియేటర్లలో బాహుబలి ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. బయ్యర్లు కూడా ఎక్కువ రేటు కు కొన్నారు…

బాహుబలి సినిమా సన్నాహాలు మొదలైపోయాయి. బయ్యర్లు ఫిక్సయిపోయారు కాబట్టి, థియేటర్ల బుకింగ్ లు జోరందుకున్నాయి. దాదాపు తొంభై అయిదు శాతం థియేటర్లలో బాహుబలి ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. బయ్యర్లు కూడా ఎక్కువ రేటు కు కొన్నారు కాబట్టి, ఎలాగైనా తొలివారం మాగ్జిమమ్ మొత్తం లాగేయాలని చూస్తున్నారు. ఆ మాటకు వస్తే, తొలివారం ఏమిటి? సినిమా విడుదలకు ముందే బయర్ల దగ్గరకు దాదాపు పెట్టుబడి వచ్చేసే విధంగా స్కీములు రన్ చేస్తున్నారు. 

అదెలా అంటే పెద్ద సినిమాలకు నిర్మాతలు ఇంత మొత్తం అని థియేటర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమా ఇవ్వడం పద్దతి. పెద్ద సినిమా అనేసరికి థియేటర్లు పోటీ పడి, నాకు, నాకు అంటూ భారీగా అడ్వాన్స్ లు ఇస్తాయి. సినిమా రన్ అయితే ఓకె. కాకుంటే, ఆ అడ్వాన్స్ లను తరువాతి సినిమాల్లో చూసుకుంటారు. 

ఇప్పుడు విషయం ఏమిటంటే, ఊళ్లలో వుండే థియేటర్లకు అన్నింటికీ కబురు చేస్తున్నారట..మీ థియేటర్ రికార్డు..ఇది. ఫలానా సినిమా మీ థియేటర్లో హయ్యస్ట్ కలెక్ట్ చేసింది..సరిగ్గా అంత మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వండి..బాహుబలి వేసుకోండి. ఇదీ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ సమీపంలోని ఓ థియేటర్లలో గబ్బర్ సింగ్ ది హయ్యస్ట్ కలెక్షన్. ముఫై లక్షలు. ఇప్పుడు ఆ ముఫై లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని బాహుబలి ఇచ్చారు. 

అంటే ఈ లెక్కన సినిమా విడుదలకు ముందే బయ్యర్లకు తమ డబ్బులు తమ దగ్గరకు చేరిపోతాయి..సేఫ్ అయిపోతారు. తీసుకున్న అడ్వాన్స్ ల మేరకు కలెక్షన్ రాకుంటే కదా, తిరిగి ఇవ్వాల్సింది..అది కూడా డబ్బు రూపంలో ఇవ్వరు. వచ్చే సినిమా ఏదో ఒకటి ఇస్తారు. అప్పుడు సంగతి అప్పుడు అన్నమాట.  మరోపక్క బాహుబలి మారు బేరాలు, లోకల్ హక్కులు తదితర వ్యవహారాలు చాలా చురుగ్గా జరుగుతున్నట్లు బోగట్టా.