బ్రూస్ లీ సినిమా ముందు అబ్బాయ్ చరణ్ వెళ్లి బాబాయ్ ను కలిసారు. బెస్టాఫ్ లక్ చెప్పారు బాబాయ్. సినిమా విడుదలయింది..మళ్లీ కలిసారు..అభినందనలు తెలిపారు బాబాయ్. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఇంతకూ అబ్బాయ్ సినిమా బ్రూస్ లీ ని బాబాయ్ చూసారా?
చూసి వుంటే ట్వీట్ చేయడమో, లేదా, కనీసం కలిసినపుడు, ఫలానా సీన్ బాగుందని అనడమో జరిగి వుండాలి కదా? అబ్బాయ్ తన సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించవచ్చు కదా..బాబాయ్ కోసం. పోనీ బాబాయ్ కూడా సినిమా ఎలా వచ్చిందో అన్న ఆసక్తితో చూడవచ్చు కదా? ఏదో ఒకటి చేయకుంటే, మరి సినిమాపై అభినందనలు ఎలా తెలియచేస్తారు?
ప్రొడక్టు ఎలా వుందో చూడకుండానే అభినందించేస్తారా? నిజానికి ప్రొడక్ట్ చూసి వుంటే, పవన్ లాంటి వ్యక్తి తప్పకుండా చరణ్ కు సినిమాలు, సబ్జెక్ ల ఎంపికలో కాస్త సలహాలు సూచనలు ఇస్తారు..అందులో సందేహం లేదు. పైగా అవన్నీ చరణ్ కు మరింత ఉపయోగడపతాయి..అందులోనూ సందేహం లేదు.