మెగాక్యాంప్ లో ఏం జరుగుతోంది?

మరో రెండు నెలల సమయం మాత్రం మిగిలింది మెగాస్టార్ 150 వ సినిమాకు క్లాప్ కొట్టడానికి. ఈలోగా కథ ఫైనల్ కావాలి. స్టోరీ లైన్ విన్న ఎగ్జయిట్ మెంట్ తో, డాడీ సినిమాకు కథ…

మరో రెండు నెలల సమయం మాత్రం మిగిలింది మెగాస్టార్ 150 వ సినిమాకు క్లాప్ కొట్టడానికి. ఈలోగా కథ ఫైనల్ కావాలి. స్టోరీ లైన్ విన్న ఎగ్జయిట్ మెంట్ తో, డాడీ సినిమాకు కథ దొరికేసిందన్న ఆనందంలో చెర్రీ ట్వీట్ చేసేసాడు..పూరితో సినిమా అంటూ. కానీ ఇప్పుడు లాక్కోలేక, పీక్కోలేక కిందా మీదా అవుతున్నారు. 
ఇద్దరమ్మయిలతో..సినిమా సమయంలో పూరి తన మాట వినలేదని, కరెక్షన్స్ చెప్పినా, చేస్తానని చెప్పి చేయలేదని, ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే అని అల్లు అరవింద్ తన మాటగా మెగాస్టార్ చెవిన వేసినట్లు వినికిడి. 

సినిమాను టేకిటీజీగా తీసుకుంటాడని, తాను అనుకున్నదే తప్ప, మనం చెప్పింది వినడని కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ముందు నుంచీ ఈ సినిమాకు హాట్ ఫ్యావరెట్ అనుకున్న వివి వినాయక్ మళ్లీ రంగంలోకి వచ్చి, తాను ఎలాగైనా చేస్తానని కూర్చున్నాడు.ఆయనకు కథ సెట్ కావడం లేదు. చిన్ని కృష్ణలాంటి వాళ్లను కూడా అడిగాడని నిన్ననే వెబ్ సైట్లు వార్తలు రాసేసాయి.

అయినా కూడా కథ కోసం చూసి, వినాయక్ తోనే చేయాలని మెగా క్యాంప్ ఆలోచిస్తోందట. పూరికి చాన్స్ ఇవ్వడం దాదాపు వుండకపోవచ్చని, మెగా క్యాంప్ నుంచి వినవస్తున్న సమాచారం.  దీనికి తోడు నితిన్ లాంటి కొత్త ఫ్రెండ్స్, పవన్ లాంటి బంధువులు కూడా చరణ్ దగ్గర పూరికి అవకాశం ఇవ్వడం అంత మంచిది కాదని చెబుతున్నట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి.