సమంతకి బికినీ అవసరమా.?

గ్లామర్‌ వున్నప్పుడే అవకాశాల్ని సంపాదించుకోవాలి.. కానీ, గ్లామర్‌తో సంబంధం లేకుండా అవకాశాలొస్తున్నప్పుడు బికినీని ఆశ్రయించడమెందుకు.? సమంత తొందరపడి బికినీలో కన్పించిందంటూ సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత మాత్రం, సూర్యతో చేసిన ‘సికిందర్‌’ సినిమాలో…

గ్లామర్‌ వున్నప్పుడే అవకాశాల్ని సంపాదించుకోవాలి.. కానీ, గ్లామర్‌తో సంబంధం లేకుండా అవకాశాలొస్తున్నప్పుడు బికినీని ఆశ్రయించడమెందుకు.? సమంత తొందరపడి బికినీలో కన్పించిందంటూ సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత మాత్రం, సూర్యతో చేసిన ‘సికిందర్‌’ సినిమాలో బికినీతో కన్పించడాన్ని సమర్థించుకుంది. 

‘దాన్ని వింతగా చూడాల్సిన పనిలేదు.. దానిపై చర్చ కూడా అనవసరం.. అదో గ్లామర్‌ అటెంప్ట్‌ మాత్రమే..’ అని కొట్టి పారేసింది. వాస్తవానికి సమంత, తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. రెండు కోట్ల దాకా ఆమె రెమ్యునరేషన్‌ పలుకుతోంది. సమంతకి పోటీనిచ్చే హీరోయిన్‌ ఇంకొకరు లేరు తెలుగులో అయినా తమిలంలో అయినా. 

కానీ సమంత మాత్రం, గ్లామర్‌ విషయంలో హద్దులు దాటేస్తోంది. కారణమేంటని ఆరా తీస్తే, తనకు పోటీనిస్తోన్న శృతిహాసన్‌కి ధీటుగా తానూ గ్లామరస్‌ స్టార్‌నని అన్పించుకోవడానికే సమంత ఇలా చేస్తోందని తేలింది. నిజమేనా.? అనడిగితే, ‘నాకెవరితోనూ పోటీ లేదు..’ అంటూ సమంత ఇదివరకు చెప్పిన పాత డైలాగ్‌నే చెబుతోందట. 

‘అల్లుడు శీను’ సినిమాతో గ్లామర్‌ని ఎడా పెడా ఆరేసేసిన సమంతపై ఇప్పుడు దర్శక నిర్మాతల నుంచి ‘బికినీ ఒత్తిడి’ పెరగడమైతే ఖాయం. ఒకప్పుడు సమంత అంటే, క్యూట్‌ హీరోయిన్‌.. పెర్ఫామెన్స్‌ విషయంలో చించేస్తుందని ఆమెపై దర్శక నిర్మాతలకు నమ్మకం. అది నిజం కూడా. కానీ, ఇప్పుడు వాటితోపాటు సమంతకి అదనపు ఆకర్షణ.. అదే ఆమె హాట్‌ హీరోయిన్‌ అన్న ట్యాగ్‌.