యమా హర్రీగా త్రివిక్రమ్

మహేష్, బన్నీ, పవన్ ఈ ముగ్గురికి త్రివిక్రమ్ అంటే మంచి అభిమానం గౌరవం. ఇవ్వాళ ముగ్గురు మూడు ప్రాజెక్టుల్లో బిజీగా వుండి వుండొచ్చు. కానీ అంత మాత్రం చేత త్రివిక్రమ్ చేస్తానంటే సినిమా చేయమని…

మహేష్, బన్నీ, పవన్ ఈ ముగ్గురికి త్రివిక్రమ్ అంటే మంచి అభిమానం గౌరవం. ఇవ్వాళ ముగ్గురు మూడు ప్రాజెక్టుల్లో బిజీగా వుండి వుండొచ్చు. కానీ అంత మాత్రం చేత త్రివిక్రమ్ చేస్తానంటే సినిమా చేయమని మాత్రం అనరు. మహేష్ కూడా బ్రహ్మోత్సవం సగానికి వచ్చాక డేట్లు ఇస్తాననే అన్నాడని వినికిడి. కానీ తొలిసారి త్రివిక్రమ్ ఏదో ఒక సినిమా ఇమ్మీడియట్ గా చేయాలని తొందరపడుతున్నట్లు వినికిడి. 

తనంటే అభిమానం వున్న పెద్ద హీరోలు రెడీ అయ్యే లోపల ఓ సినిమా చేసేయాలని అనుకుంటున్నాడట. సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తారు….అంతకన్నా కూల్ గా పనిచేస్తారు త్రివిక్రమ్. కానీ ఈ సారి మాత్రం ఎందుకో ఏదో ఒక సినిమా అర్జెంట్ గా చేయాలని తొందరపడుతన్నట్లు కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. అదెందుకన్నదే తెలియదు. అందుకోసమే ఓ ఫ్యామిలీ స్టోరీని ఎంచుకున్నారట. 

ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువే కానీ, మరీ హీరోయిన్ ఓరియెంటెడ్ మాత్రం కాదట. హీరోకి మంచి పాత్ర వుంటుందని వినికిడి. అయితే ఆ హీరో హీరోయిన్లు ఎవరు అన్నదే ఇప్పుడ మిలియన్ డాలర్ల క్వశ్చన్. అది తేలడం లేదని వినికిడి. అది తేలితే బండి పట్టాలమీదకు వెళ్తుంది..మళ్లీ త్రివిక్రమ్ స్టయిల్ సినిమా కనిపించడానికి అవకాశం వుంటుంది.