ఆ ‘స్వగతం’ రాసింది ఎవరు?

కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని..సినిమాలో ప్రారంభం నుంచి చివరి వరకు..హీరో సుధీర్ బాబు స్వగతం ఒకటి అప్పుడు అప్పుడు వినిపిస్తూ వుంటుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి కారులో ఊరికి చేరేవరకు ఈ…

కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని..సినిమాలో ప్రారంభం నుంచి చివరి వరకు..హీరో సుధీర్ బాబు స్వగతం ఒకటి అప్పుడు అప్పుడు వినిపిస్తూ వుంటుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి కారులో ఊరికి చేరేవరకు ఈ స్వగతం అప్పుడు కొంత అప్పుడు కొంత వినిపిస్తూవుంటుంది. అయితే ఈ స్వగతం రాసింది, ఆ సినిమాకు మాటలు అందించిన ఖదీర్ బాబేనా కాదా అన్న విషయంపై చిన్న గుసగుస వినిపిస్తోంది.

అసలు ఈ సినిమాకు రచయితగా ఇటీవల కాస్త డెప్త్ వున్న రచయితగా పేరు తెచ్చుకుంటున్న బుర్రా సాయి మాధవ్ ను అడిగారని వినికిడి. అయితే ఆయనకు ఎందుకనో వీలు కాలేదట. దాంతో సాక్షిలో పనిచేసే ఖదీర్ బాబును తీసుకున్నారు. 

ఆయన కూడా మంచి రచయితే. అయితే ఈ స్వగతం ఎపిసోడ్ నెరేషన్ కాస్త కీలకమైంది కావడంతో, దాన్ని మాత్రం రాయమని సాయి మాధవ్ నే అడిగినట్లు తెలుస్తోంది. దానికి అంగీకరించి, ఆయన రాసారని వినికిడి. మరి నిజమెంతో యూనిట్ కే తెలియాలి.