పులి తమిళనాటనే ఇబ్బందుల్లో పడి గట్టెక్కింది. కానీ తెలుగునాట మాత్రం గాండ్రించలేకపోతోంది. అక్కడి ఐటి వ్యవహారాలు ఇవన్నీ వేరు. ఇక్కడి వ్యవహారాలు వేరు. తెలుగు వెర్షన్ నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా, లెక్కలు తేలక ఇక్కడ చిక్కుల్లో పడింది పులి. మరి ఆ చిక్కులు ఎప్పుడు తీరుతాయో, అది ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది తెలియడం లేదు.
మరోపక్క తమిళనాట సినిమాకాస్త అటు ఇటుగా వుందన్న టాక్ వెలువడింది. దీంతో మరి తెలుగులో విడుదల చేయడం అన్నా, దాన్ని కొన్నవాళ్లు అమౌంట్లు కట్టడం అన్నా సమస్యగా మారుతుంది. సినిమా విడుదల ఇక్కడ సమస్యగా వుంటే, నిర్మాత చెన్నయ్ లో సినిమా కోసం కూర్చున్నారు. వాళ్లుకు అమౌంట్ కట్టిన తరువాత సినిమా ఇవ్వాలి..ఇక్కడ సమస్యలు తీరాలి..విడుదల కావాలి.
అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ శుక్రవారం విడుదల చేస్తారని ఒక వెర్షన్ వినిపిస్తోంది. కానీ శుక్రవారం విడుదల కాకపోతే, మరి ఇప్పట్లో విడుదల చేసుకోవడం కష్టమని, థియేటర్ల సమస్య వస్తుందని అంటున్నారు.