మూడు కోట్లు..ముఫై లక్షలు

చార్మి టైమ్ బాగున్నట్లుంది. పెద్ద ఆఫర్ల వెంట పడకుండా పూరి జగన్నాధ్ ఆమెతో జ్యోతిలక్ష్మి సినిమా చేస్తున్నాడు. అలాగే మురగదాస్-విక్రమ్ కాంబినేషన్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఫినిష్ చేసింది. ఈ అయిటమ్ సాంగ్ ఆ…

చార్మి టైమ్ బాగున్నట్లుంది. పెద్ద ఆఫర్ల వెంట పడకుండా పూరి జగన్నాధ్ ఆమెతో జ్యోతిలక్ష్మి సినిమా చేస్తున్నాడు. అలాగే మురగదాస్-విక్రమ్ కాంబినేషన్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఫినిష్ చేసింది. ఈ అయిటమ్ సాంగ్ ఆ సినిమాకు చాలా స్పెషల్ అని వినికిడి. దీని చిత్రీకరణకు మురగదాస్ భారీగానే ఖర్చు చేసారట. 

సుమారు మూడు కోట్ల వరకు సాంగ్ పిక్చరైజేషన్ కు ఖర్చయిందని తెలుస్తోంది. ఈ ఖర్చులో చార్మికి అయిటమ్ సాంగ్ రెమ్యూనిరేషన్ ముఫై లక్షలు కూడా వుందనుకోండి. ఇదేదో బాగానే వుంది. టాప్ హీరోయిన్ ఫుల్ సినిమా చేస్తే యాభై లక్షల నుంచి కోటి రూపాయిలు. అయిటమ్ సాంగ్ కు ముఫై లక్షలు. గిట్టుబాటు వ్యవహారమే.