పండగచేస్కోకు కలిసి వచ్చిన షాడో

ఒక దగ్గరపోతే ఇంకోదగ్గర వస్తుంది..సినిమా బిజినెస్ ఇలాంటిదే. షాడో సినిమా దారుణంగా దెబ్బతింది..దాంతో బయ్యర్లు లబోదిబో అన్నారు. టాలీవుడ్ లో రిటర్న్ ఇవ్వడం వుండదు..కావాలంటే తరువాతి సినిమాలో తగ్గించుకోవడాలే వుంటాయి. ఇప్పుడు పండగచేస్కో సినిమా…

ఒక దగ్గరపోతే ఇంకోదగ్గర వస్తుంది..సినిమా బిజినెస్ ఇలాంటిదే. షాడో సినిమా దారుణంగా దెబ్బతింది..దాంతో బయ్యర్లు లబోదిబో అన్నారు. టాలీవుడ్ లో రిటర్న్ ఇవ్వడం వుండదు..కావాలంటే తరువాతి సినిమాలో తగ్గించుకోవడాలే వుంటాయి. ఇప్పుడు పండగచేస్కో సినిమా అలా కాస్త డిస్కౌంట్ రేట్లకే బయ్యర్లకు వచ్చినట్లు టాలీవుడ్ 

దాంతో తొలివారం కలెక్షన్లు చాలా వరకు బయ్యర్లను సేఫ్ జోన్ కు చేర్చాయని అంటున్నారు. విశాఖ కోటి డెభైకి, కృష్ణా, గుంటూరు, తదితర ప్రాంతాలు ఒక్కొక్కటి కోటి రూపాయిలకు కాస్తపైగా ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలివారం కలెక్షన్లు 50 నంచి 70 శాతం రికవరీ చేసాయట. మలివారం కూడా ఫరవాలేదనే ధీమా కనిపిస్తోంది. 

ఎందుకంటే ఈవారం సరైన పెద్ద సినిమాలు లేవు. విడుదలైన వాటిలో అసుర మాత్రగా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందువల్ల పండగచేస్కో బయ్యర్లు ఈ వారంతో సేఫ్ అయిపోతారని తెలుస్తోంది.