ఆవిడను లిస్ట్‌ నుండి తీసేసింది అందుకేనట

ఆకలేసినపుడు అమ్మనూ, కష్టాల్లో స్నేహితుడినీ గుర్తు చేసుకోమంటారు. ఇక ప్రేయసి అయితే కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సుఖాల్లో మాత్రం సమాన వాటా కావాలంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఆవిడ కనీసం చూడటానికి కూడా…

ఆకలేసినపుడు అమ్మనూ, కష్టాల్లో స్నేహితుడినీ గుర్తు చేసుకోమంటారు. ఇక ప్రేయసి అయితే కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సుఖాల్లో మాత్రం సమాన వాటా కావాలంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఆవిడ కనీసం చూడటానికి కూడా రాలేదు. అప్పుడే  ఆమె అంతరంగం తెలిసిపోయింది. అలాంటి వాళ్లను స్నేహితుల లిస్ట్‌లోంచి తీసేసాను అంటున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. 

ఈయన హీరోగా వెలిగిపోతున్నప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌  మాధురీ దీక్షిత్‌తో ఎన్నో పుకార్లు షికార్లు చేసాయి. అందులో నిజం లేకపోలేదు. పెళ్లిదాకా కూడా ఈ విషయం వచ్చిందట. అప్పుడే సంజయ్‌దత్‌ లైఫ్‌ కుదేలయ్యే షాకింగ్‌ న్యూస్‌. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటంతో అరెస్ట్‌. నాలుగు సినిమాలు పెండింగ్‌లో పడిపోయాయి. తండ్రి ఎంపీగా ఉన్నా ప్రయోజనం లేదు. అంతటి సీరియస్‌ కేసుల్లో ఇరుక్కున్నాడు. 

సంజయ్‌దత్‌ జైల్లో ఉండగా ఆయనతో నటించిన హీరోయిన్స్‌ అందరూ జైలుకొచ్చి ఆయన్ని పరామర్శించారట. ఒక్క మాధురీ దీక్షిత్‌ జాడే లేదట. ఆ టైంలో ఆమె వస్తే ఎంతో రిలీఫ్‌ పొందాలని సంజయ్‌దత్‌ ఎదురు చూశాడట. ఆమె జైలు దాకా రాకపోతే పోయె. కనీసం పత్రికా ప్రకటనల్లో కూడా ఖండించలేకపోవడం ఆయన్ని గాయపరిచిందట. అంతే ఆమె జ్ఞాపకాల్ని తుడిచేశానంటున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరా ఇవ్వని ప్రేమ ఎందుకు వ్యర్ధం అంటున్నాడాయన.