త్రివిక్రమ్ కు నో ఆప్షన్?

మరీ స్టార్ డైరక్టర్ హోదా వచ్చేస్తే అదే సమస్య. పూరి జగన్నాథ్ లా అందరూ డిఫరెంట్ గా కెరీర్ ను సెట్ చేసుకోలేరు. మహేష్ తోనూ చేస్తాడు..అంతలో నితిన్ తోనూ చేస్తాడు..లేదంటే చార్మితో జ్యోతిలక్ష్మి…

మరీ స్టార్ డైరక్టర్ హోదా వచ్చేస్తే అదే సమస్య. పూరి జగన్నాథ్ లా అందరూ డిఫరెంట్ గా కెరీర్ ను సెట్ చేసుకోలేరు. మహేష్ తోనూ చేస్తాడు..అంతలో నితిన్ తోనూ చేస్తాడు..లేదంటే చార్మితో జ్యోతిలక్ష్మి అంటూ చిన్న సినిమా చేసేస్తాడు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. ఏస్ డైరక్టర్ గా ముందు నుంచీ ముద్రపడిపోయాడు. మహేష్, పవన్, బన్నీ ఇలా కొద్దిమంది టాప్ లైన్ హీరోలతోనే సినిమాలు. ప్రారంభలో ఒక్కటి రెండు చిన్నవి చేసి, వర్కవుట్ కాక, తత్వం తలకెక్కించుకుని, ఇలా మారిపోయాడు. 

కానీ ఇప్పుడు అదే ఇబ్బందిగా మారింది. సత్యమూర్తి తరువాత సినిమా చేయాలంటే ఎవరూ అందుబాటులో లేకుండా అయింది. సత్యమూర్తి తరువాత మహేష్ కన్ ఫర్మ్ అనుకున్నాడు. సత్యమూర్తి రిజల్ట్ ఫైనాన్షియల్ గా ఎలా వున్నా, స్క్రిప్ట్ పరగా త్రివిక్రమ్ కు ఇండస్ట్రీ ఇన్ సైడ్ లెక్కల్లో మైనస్ మార్కలు పడ్డాయని వినికిడి. దాంతో మహేష్ బ్రహ్మోత్సవం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, త్రివిక్రమ్ ప్రాజెక్టును పక్కన పెట్టేసాడు. రామ్ చరణ్ దగ్గరకు త్రివిక్రమ్ వెళ్లడని వినికిడి. 

ఎందుకంటే అక్కడ అతగాడికి అంత ఫ్రీడమ్ లభించదని, పరుచూరి బ్రదర్స్, చిరంజీవి వంటి వారి అజమాయిషీ ఎక్కువని టాక్. బన్నీతో ఇప్పుడే చేసాడు. పవన్ కు ఆయన కమిట్ మెంట్ లు ఆయనకు వున్నాయి. మరి మిగిలింది ఎన్టీఆరే. అందుకే అటు వెళ్లక తప్పలేదు. అయితే ఇక్కడ ఇంకో ఓపెన్ ఆఫర్ వుంది. కానీ అది టైమ్ పడుతుంది. అదే అఖిల్ సినిమా. నాగార్జున కు త్రివిక్రమ్ తో అఖిల్ కు ఓ సినిమా చేయించాలని వుంది. కానీ తొలి సినిమా పూర్తి కావాలి. అప్పుడు కానీ రెండో సినిమా సంగతి ఆలోచించడానికి లేదు. అందుకే ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలి. 

ఇలాంటి సమయంలో సుకుమార్ సినిమా ముందు వెనుక ఆడుతోంది అని తెలిసి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ వెంటన్ భోగవిల్లి ప్రసాద్ అప్రమత్తమై తన సినిమా పనులు స్పీడప్ చేసారని తెలుస్తోంది. సో..ఆ సినిమా అయ్యేదాకా ఆగి ఎన్టీఆర్ సినిమా చేయడమా? లేదా అప్పటికి తన హీరోలు ఎవరైనా ఖాళీ అవుతారని చూడడమా? మొదటి ఆప్షనే బెటర్ అనుకుంటున్నారని టాలీవుడ్ టాక్.