చరణ్ సినిమా టైటిల్ ‘అదయితే’ కాదు

మై నేమ్ ఈజ్ రాజు..ఈ టైటిల్, చరణ్-శ్రీనువైట్ల సినిమా ప్రారంభం కాక ముందు నుంచీ వినిపిస్తోంది. ఇది కాదు టైటిల్ అని గ్రేట్ ఆంధ్ర ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అందరూ అదే మాట అంటున్నారు. …

మై నేమ్ ఈజ్ రాజు..ఈ టైటిల్, చరణ్-శ్రీనువైట్ల సినిమా ప్రారంభం కాక ముందు నుంచీ వినిపిస్తోంది. ఇది కాదు టైటిల్ అని గ్రేట్ ఆంధ్ర ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అందరూ అదే మాట అంటున్నారు. 

అయితే ఇప్పుడు మరో రెండు కొత్త టైటిళ్లు వినిపిస్తున్నాయి. బ్రూస్లీ, సుప్రీమ్..ఈ టైటిళ్లు కూడా కాకపోవచ్చని తెలుస్తోంది. బ్రూస్లీ అని టైటిల్ పెడితే మరీ సెకెండ్ గ్రేడ్ గా వుంటుదని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీమ్ టైటిల్ కూడా అంత గొప్పగా ఏమీ లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

మెగాస్టార్ అయితే, సరైన మాంచి తెలుగు టైటిల్ చూడండంటున్నారట. నాయక్, రచ్చ, ఇలా. మరి శ్రీను వైట్ల ఏం ఫిక్స్ చేస్తాడో?