డిసెంబర్ 8 నుంచి కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు..నాగార్జనకు మాంచి పేరు తెచ్చిన టీవీ షో. ఇప్పుడు ఈ టీవీషో సెకండ్ సీజన్ ప్రారంభమైంది. అన్నపూర్ణలో మలి విడత కార్యక్రమాల షూటింగ్ కు సోమవారం శ్రీకారం చుట్టారు. వివిధ స్థాయిల్లో…

మీలో ఎవరు కోటీశ్వరుడు..నాగార్జనకు మాంచి పేరు తెచ్చిన టీవీ షో. ఇప్పుడు ఈ టీవీషో సెకండ్ సీజన్ ప్రారంభమైంది. అన్నపూర్ణలో మలి విడత కార్యక్రమాల షూటింగ్ కు సోమవారం శ్రీకారం చుట్టారు. వివిధ స్థాయిల్లో వడపోత అనంతరం లైవ్ షూటింగ్ ప్రారంభమైంది.

 బహుశా డిసెంబర్ 8 నుంచి మలి విడత కార్యక్రమాల ప్రసారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా. ఆ వేళకు చాలా వరకు ఎపిసోడ్ లు రెడీ కావాల్సి వుంది. అనుకున్నట్లు షెడ్యూలు సాగితే, డిసెంబర్ 8 నుంచి మళ్లీ మరోసారి కోటీశ్వరుడు కార్యక్రమం జనాలకను అలరించేందుకు సిద్ధమైపోతుంది.