నవలలకు డిమాండ్..ఆర్తికి చాన్స్

జ్యోతిలక్ష్మి సినిమా పుణ్యమా అని జనం దృష్టి మళ్లీ నవలలపైకి మళ్లింది. ఈ సినిమా మల్లాది మిసెస్ పరాకుశం నవల ఆధారం. ఇప్పుడు ఇంకో నవల కూడా సినిమాగా మారబోతోంది. చల్లా సుబ్రహ్మణ్యం ఎప్పుడో…

జ్యోతిలక్ష్మి సినిమా పుణ్యమా అని జనం దృష్టి మళ్లీ నవలలపైకి మళ్లింది. ఈ సినిమా మల్లాది మిసెస్ పరాకుశం నవల ఆధారం. ఇప్పుడు ఇంకో నవల కూడా సినిమాగా మారబోతోంది. చల్లా సుబ్రహ్మణ్యం ఎప్పుడో రాసిన క్యాబరే డాన్సర్ నవలను సినిమాగా రూపొందించబోతున్నారు. 

ఈ నవల క్యాబరే డ్యాన్సర్ల స్థితిగతులపై రాసిన నవల. అప్పట్లో ఆయన క్యాబరే డాన్సర్లను ఇంటర్వూ చేసి, వివరాలు సేకరించి ఈ నవల రాసారు. క్యాబరేడాన్సర్ల జీవితం అంటే బి సి సెంటర్లకు కావాల్సిన మసాలా బోలెడు దట్టించే అవకాశం వుంది. 

ఈ సినిమాకు ఆర్తి అగర్వాల్ ను తీసుకున్నారు. ఒకప్పటి హీరోయిన్ ఆమె. మరి ఆమెను మెయిన్ లీడ్ గా తీసుకున్నారో, సెకండ్ లీడ్ గా తీసుకున్నారో ఇంకా తెలియదు.