మంచి ఫామ్‌లో ఉండగా రాజకీయాల్లోకి రావాలని పవన్ నిర్ణయించుకోవడం అతని అభిమానుల్ని బాధ పెట్టింది. మహా అయితే మరో రెండు, మూడేళ్లు నటిస్తానని పవన్ ఆల్రెడీ ప్రకటించేసాడు. అయితే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అతని ఆరోగ్య కారణాలే ప్రధానమని తెలిసింది. ‘గబ్బర్‌సింగ్’ సినిమా షూటింగ్ నుంచి పవన్‌ని వెన్నునొప్పి వేధిస్తోంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ టైమ్‌లో కూడా పవన్ దీంతో చాలా ఇబ్బంది పడ్డాడు. మధ్యలో విదేశాల్లో చికిత్స తీసుకున్నా కానీ లాభం లేకుండా పోయింది. బ్యాక్ పెయిన్ తిరగబెట్టడం వల్లే పవన్ ఇంతవరకు గబ్బర్‌సింగ్ 2 షూటింగ్ మొదలు పెట్టలేదు. తన శరీరాన్ని పెద్దగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేని గోపాల గోపాల సినిమాలోని పాత్రని ఎంచుకున్నాడు.
పవన్ బ్యాక్ పెయిన్ విషయం కొంతకాలంగా మీడియాలో అక్కడక్కడా వినిపిస్తున్నా కానీ రేణు దేశాయ్ ఆ విషయాన్ని అఫీషియల్ చేసేసింది. గంట సేపు విమానంలో ట్రావెల్ చేయడం కూడా వీలు కాని పరిస్థితిలో పవన్ ఉన్నాడిపుడు. షూటింగ్ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగేలా చూసుకోమని దర్శకులకి స్పష్టం చేస్తున్నాడు. పవన్‌ని బాధిస్తోన్న ఈ పెయిన్ త్వరగా తగ్గిపోయి మళ్లీ పవర్‌స్టార్ ఫుల్ ఎనర్జీతో తెరపై దర్శనమివ్వాలని కోరుకుందాం.