సంక్రాంతి బ‌రిలో మ‌హేష్‌

నేడు (ఆదివారం) కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు – శ్రీ‌కాంత్ అడ్డాల చిత్రం 'బ్రహ్మోత్సవం' ప్రారంభం కానుంది. హైద‌రాబాద్‌లోని పీవీపీ కార్యాల‌యంలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. జులై నుంచి…

నేడు (ఆదివారం) కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు – శ్రీ‌కాంత్ అడ్డాల చిత్రం 'బ్రహ్మోత్సవం' ప్రారంభం కానుంది. హైద‌రాబాద్‌లోని పీవీపీ కార్యాల‌యంలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. జులై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ప్రారంభం అవుతుంది. ఎట్టిప‌రిస్థితుల‌లోనూ జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోందట‌. 

మ‌హేష్‌కి సంక్రాంతి సెంటిమెంట్ బాగానే క‌లిసొచ్చింది. ఈ సంక్రాంతికి కూడా త‌న సినిమా బ‌రిలో ఉండాల‌ని భావిస్తున్నాడ‌ట‌. పైగా శ్రీ‌మంతుడు లాంటి ఫ్యామిలీ డ్రామాకి సంక్రాంతి అయితేనే బెస్ట్ సీజ‌న్ అనుకొంటున్నాడ‌ని స‌మాచారం. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా `గ‌బ్బర్ సింగ్ 2`ని సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యాడు. అంటే బాక్సాఫీసు ద‌గ్గర టాప్ స్టార్ల స‌మ‌రం చూడొచ్చన్నమాట‌.