సూర్య సినిమా రాక్షసుడుకి షాక్ తగిలింది. ఈ సినిమాని కువైట్లో బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ మత సంప్రదాయాలకు ఈ సినిమా విరుద్ధంగా ఉందనే కారణంగా రాక్షసుడుని బ్యాన్ చేశారట. అతీంద్రియ శక్తుల సినిమాలు, హారర్ కథల్ని.. ఇస్లామిక్ ప్రభుత్వాలు ప్రోత్సహించవు.
రాక్షసుడు సినిమాలోనూ అలాంటి పాయింట్ ఉందన్న కారణంతో ఈ సినిమా విడుదలను నిలిపివేసినట్టు సమాచారం. అయితే.. రాక్షసుడు చిత్రబృందం మాత్రం.. 'మా సినిమాలో అలాంటివేం లేదు..' అని నిరూపించుకొనే ప్రయత్నాల్లో ఉంది. శుక్రవారమే సినిమా విడుదల. ఈలోగా వాళ్ల ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.