తమిళ హీరో సూర్య లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమా టీజర్ ను ఈ అర్థరాత్రి విడుదల చేయబోతున్నారు నిర్మాత జ్ఙాన్ వేల్ రాజా. ఓ చారిత్రాత్మక వీరుడి కథ ఆధారంగా తీసున్న సినిమా ఇది. టీజర్ అవుట్ అండ్ అవుట్ చాలా భారీగా వుంది. ఓ భారీ వార్ సీన్ నేపథ్యంలో హీరోను పరిచయం చేస్తుందీ టీజర్.
ఈ టీజర్ అంతా భారీ చిత్రీకరణ పరచుకుంది. దీనికి దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా మాచ్ అయింది. గ్రాఫిక్ సీన్స్ అయినా క్వాలిటీ వల్ల చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి.
కేవలం సూర్య మీదే టీజర్ ఫోకస్ అయింది. అందువల్ల సినిమా కథ గురించి కానీ, మిగిలిన పాత్రల ప్రస్తావన కానీ లేదు. అయితే టీజర్ ప్రారంభంలో ఓ సాకీ మాదిరిగా ఆ వీరుడి గురించి, వీరత్వం గురించి చెప్పుకుంటూ వెళ్లారు.
జ్ఙాన్ వేల్ రాజా తన స్టూడియో గ్రీన్ మీద సినిమా చేసి చాలా కాలం అయింది. కంగువ సినిమాలు పలు భారతీయ భాషల్లో అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను యువి సంస్థ అందిస్తోంది.