వయసు మీద పడుతున్నా, తాతలైపోతున్నా ఇంకా హీరోలుగానే నటిస్తామంటారు మన సినిమా జనాలు. అమితాబ్, మోహన్ లాల్ మాదిరిగా వైవిధ్యమైన పాత్రల జోలికి పోరు. కానీ ఎన్టీఆర్, ఎఎన్నార్ ల కాలం కాదు. యాభై ఏళ్లు దాటినా పద్దెనిమిదేళ్ల శ్రీదేవితో డ్యాన్స్ చేస్తే చూడడానికి. వయసు మూడు పదులు దాటిన తరువాత ఫీల్డ్ లోకి వచ్చిన సుజాతను హీరోయిన్ గా అంగీకరించిన కాలం అంతకన్నా కాదు. దాంతో హీరోయిన్ల సమస్య వస్తోంది..ముదిమి మీదపడిన హీరోలకు.
నిన్న మొన్నటి దాకా బాలయ్య ఈ సమస్య ఎదుర్కొన్నారు. ఇప్పుడు మెగాస్టార్ కూ ఇదే సమస్య అంట. చిరు 150 వ సినిమాకు హీరోయిన్ అంత సులువుగా సెట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. నయనతారను అడిగారు..మూడు కోట్లు డిమాండ్ చేసిందని టాక్. అయినా, నయన బాగా పరిచయం అయిపోయింది టాలీవుడ్ కు…
అందుకే ఇప్పుడు మాంచి నేమ్ తెచ్చుకుందని కంగనా రనౌత్ ను అడిగారని వినికిడి. పూరి సినిమాలో నటించిన హీరోయిన్ నే కదా. కానీ చిరంజీవి హీరోగా అని తెలియగానే స్మూత్ గా రిజెక్ట్ చేసిందని వినికిడి. మనకు మెగాస్టార్..మన చిరు 150 వ సినిమా. కానీ బాలీవుడ్ హీరోయిన్ లకు కాదు కదా..
ఇంకెవరు సై అంటారా అని వెదుకులాడుతున్నారట. త్రిష అంత గ్లామరస్ గా కనిపించడ లేదు ఇప్పుడు..పైగా ఇంతకు ముందు చిరు పక్కన వేస్తేనే, మిస్ మ్యాచ్ అన్న విమర్శలు వినవచ్చాయి.
ఇంక అనుష్క నే దిక్కు అంటున్నారు. ఎందుకంటే ఆమె మెగా క్యాంప్ లో నటించలేదు… పైగా త్వరలో పెళ్లి అన్న వార్తలు వినవస్తున్నాయి. వయసు కూడా తక్కువేమీ కాదు. చిరు పక్కన సరిపోతుంది. అయ్యో..ఇప్పుడు ఇంత సీనియర్ పక్కన నటిస్తే, మరింక జూనియర్లు చాన్సివ్వరేమో అన్న ఆలోచన కూడా వుండదు. అందరితో చేసేసింది కాబట్టి.