సిండికేట్ పై సురేష్ బాబు కినుక?

కౌన్సిల్ కు అతీతంగా ఎనిమిది మంది నిర్మాతలు సిండికేట్ కావడం వెనుక చాలా సంగతులు వున్నట్లు తెలుస్తోంది. ఈ సిండికేట్ వెనుక దగ్గుబాటి సురేష్ బాబు వున్నారని ఇన్నాళ్లు తెరవెనుక ప్రచారం జరుగుతోంది. అయితే…

కౌన్సిల్ కు అతీతంగా ఎనిమిది మంది నిర్మాతలు సిండికేట్ కావడం వెనుక చాలా సంగతులు వున్నట్లు తెలుస్తోంది. ఈ సిండికేట్ వెనుక దగ్గుబాటి సురేష్ బాబు వున్నారని ఇన్నాళ్లు తెరవెనుక ప్రచారం జరుగుతోంది. అయితే సురేష్ బాబు ఈ వ్యవహారాలను అస్సలు పట్టించుకోలేదని, నిర్మాతలను అందరినీ ఇటు తిప్పేందుకు వీలుగా సిండికేట్ కు చెందిన  కొందరు, తెలివిగా తెరవెనుక ఈ తరహా గ్యాసిప్ పుట్టించారని తెలుస్తోంది.  

ముందు లైట్ తీసుకున్న సురేష్ బాబు తరువాత తన పేరు పరోక్షంగా అయినా ప్రచారంలోకి రావడంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చెప్పిన తరువాతే తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్ పెట్టి సిండికేట్ జనాలను కడిగేసారని తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు సిండికేట్ కు నాయకత్వం వహిస్తుండంతో ఇప్పుడు సినిమా ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ విషయంలో తమ అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు దిల్ రాజు చాలా మందికి టార్గెట్ గా వున్నారని వినికిడి. 

బాహుబలి హక్కులు సిండికేట్ డిసైడ్ చేసిన చానెల్ కు కాకుండా బయటి చానెల్ కు ఇవ్వడం వెనుక కూడా ఈ వ్యవహారం దాగి వుంది అని తెలుస్తోంది. నిజానికి కోటిన్నర మొత్తం ఇటు టీవీ 9 కి కానీ, ఎన్టీవీ కానీ పెద్ద విషయం కాదు. అయినా టీవీ 5కు ఇవ్వడం వెనుక సిండికేట్ వ్యవహారాలను బ్రేక్ చేయడమే అన్నది లక్ష్యంగా తెలుస్తోంది. 

అయితే సిండికేట్ జనాలు మాత్రం, తమ నిర్ణయం వల్లనే పోటీ వచ్చి నిర్మాత లాభపడ్డారని అంటున్నారు. మొత్తం మీద సమీప భవిష్యత్ లో దిల్ రాజు కాస్త ఇబ్బందులు ఎదుర్కోనేపరిస్థితి కనిపిస్తోంది.