నిర్మాతల మండలితో సంబంధం లేకుండా ఎనిమిది మంది నిర్మాతలు సిండికేట్ గా ఏర్పడి, కొన్ని చానెళ్లకే సినిమా ఫంక్షన్ల హక్కులు, ప్రకటనలు ఇవ్వాలని డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది బాహుబలి సినిమాకు బాగా కలిసివచ్చింది. దగ్గర దగ్గర కోటిన్నర ఆదాయం తెచ్చిపెట్టింది. సిండికేట్ ఎంపిక చేసిన న్యూస్ చానెళ్లలో టీవీ 5 లేదు. ఎన్టీవీ, టీవీ 9 వున్నాయి.
అందువల్ల దీన్ని ప్రెస్టీజ్ గా తీసుకున్న టీవీ 5, కోటిన్నర ఇచ్చి బాహుబలి అడియో ఫంక్షన్ హక్కులు సంపాదించింది. అయితే మొత్తం సోలో ప్రసార హక్కులు తీసుకోవడం అన్నది ప్లస్ పాయింట్. అంటే జనరల్ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ హక్కులు కూడా టీవీ 5 కే. అది కావాలనుకుంటే ఆ హక్కులను జీ కో, జెమినికో, అమ్ముకోవచ్చు. లేదు మొత్తం టీఆర్పీ తనకే కావాలనుకుంటే సోలోగా ప్రసారం చేయచ్చు.
సినిమా ప్రారంభమైమన దగ్గర నుంచి సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి అడియో ఫంక్షన్ ప్రసార హక్కుల విషయంలో కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. మొత్తానికి సిండికేట్ వ్యూహం ఫలించింది. చానెళ్లకు చానెళ్లకు మధ్య పోటీ వాతావరణాన్ని సక్సెస్ ఫుల్ గా క్రియేట్ చేయగలిగారు. తమ నిర్ణయం నిర్మాతలకు మంచే చేస్తుందని అని సిండికేట్ ప్రూవ్ చేసింది.
కానీ పెద్ద సినిమాలు, వాటినిర్మాతలు బాగానేవుంటారు. సిండికేట్ లో వున్నవారు అంతా బడా నిర్మాతలే. కానీ చిన్న సినిమాల సంగతేమిటి? ఇక్కడకు వచ్చేసరికి మళ్లీ ఎదురు ఇచ్చి మరీ ప్రసారం చేయించుకోవాల్సిన పరిస్థితి.