శృతి హాసన్‌లో ఇంకో యాంగిల్‌

శృతిహాసన్‌ ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలుగుతూ… తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. పాప్‌ సింగర్‌ అయిన శృతిహాసన్‌ అప్పట్లో సొంత బ్యాండ్‌ కూడా మెయింటైన్‌ చేసేది. హీరోయిన్‌గా…

శృతిహాసన్‌ ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలుగుతూ… తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. పాప్‌ సింగర్‌ అయిన శృతిహాసన్‌ అప్పట్లో సొంత బ్యాండ్‌ కూడా మెయింటైన్‌ చేసేది. హీరోయిన్‌గా బిజీ అయిన తర్వాత షోస్‌ ఇవ్వడం మానేసిన శృతి అడపా దడపా నేపథ్య గాయనిగా టాలెంట్‌ చూపిస్తూనే ఉంది. 

కేవలం సింగర్‌, యాక్టర్‌గానే కాదు.. శృతి రైటర్‌గానూ తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ కోసం శృతిహాసన్‌ స్క్రిప్ట్స్‌ రెడీ చేసే పనిలో పడిరది. ఎప్పటికైనా డైరెక్టర్‌ కావాలనేది శృతి డ్రీమ్‌ అట. ఆ దిశగా అడుగులు వేసే ముందు ఇలా అనుభవం సంపాదించుకోవడానికి షార్ట్‌ ఫిలింస్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేస్తోందట. 

తన తండ్రి మాదిరిగా నటనలో మేటి అనిపించుకోకపోయినా ఆయనలానే తనకీ మల్టిపుల్‌ టాలెంట్స్‌ ఉన్నాయని మాత్రం శృతి చాటుకుంటోంది. తొందర్లోనే శృతి డైరెక్షన్‌లో ఒక అద్దిరిపోయే సినిమా వస్తుందని ఆశిద్దాం.