సాధారణంగా సెలబ్రిటీలను కిందామీదా పెట్టి, మీడియా వాళ్లకు షాకిస్తుంది. కానీ ఓ డైరక్టర్ మీడియాకే చిన్న క్లాస్ పీకడాట. ఇటీవల విడుదలైన ఓ సినిమా డైరక్టర్ ఇంటర్వూ కోసం ఓ చానెల్ క్రూ వెళ్లింది. కెమేరా బిగించి, అన్నీ సరిచూసుకునేలోగానే ఆ డైరక్టర్ వాళ్లకు క్లాస్ పీకడం ప్రారంభించాడట. నలుగురికి మంచి చెప్పడం కాదు, మీరు ఆచరించాలి అంటూ ఉపదేశించాడు.
మీ ఆఫీసు ముందు మీ కార్లు, వాహనాలు, వ్యాన్లు ఫుట్ పాత్ ను ఆక్యుపై చేసి మరీ పెడుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. సామాన్యులు ఇబ్బంది పడతున్నారు. ముందు అది సెట్ చేయండి అప్పుడు ఇంటర్వూ ఇస్తా అన్నాడట. దాంతో ఆ చానెల్ సిబ్బంది తెల్లబోయారట.
అక్కడితో ఆగకుండా, అసలు కెమేరా ఆన్ చేయండి..దాని ముందే చెబుతాను…మీ మేనేజ్ మెంట్ కు కూడా తెలియాలి అంటూ మరింత ఎదురెళ్లాడట. దీంతో ఏం చేయాలో, ఏం అనాలో తెలియక, ఆ చానెల్ సిబ్బంది కెమేరా ముడిచేసి చక్కాపోయారట. కొందరంతే..తమ స్టాండ్ మీద తాము నిల్చుండిపోతారు.