21న నాగార్జున వర్మ తొలి కాంబినేషన్ శివను 100 థియేటర్లలో విడుదల చేస్తారన్న టాక్ బయటకు వచ్చింది. నిజానికి అంతకు మందే వర్మ ఐస్ క్రీమ్ 2 ను 21 విడుదల చేస్తారని అన్నారు. మరి ఇప్పుడు ఏది వస్తుంది..ఏది రాదు అన్నది తెలియాల్సి వుంది. అసలు ఈ ఐస్ క్రీమ్ 2 అన్నది విడుదల అంటూ ఊరించడమే కానీ, వస్తుందా రాదా అన్నది తెలియడం లేదు.
రామ్ గోపాల్ వర్మ ఈ ఐస్ క్రీమ్ 2ను ఎప్పటిలాగే హడావుడిగా కానిచ్చేసారని వినికిడి. అయితే తొలిసారి రామ్ ఈ సినిమాను మళ్లీ మరోసారి చెక్కారని తెలుస్తోంది. మళ్లీ రీషూట్ లు, పాటల అటాచ్ మెంట్ లు చేసారని అంటున్నారు. ఇదిలా వుంటే ఇప్పటిదాకా అందరు చూసేసి అరిగి పోయిన శివను డిజిటిల్ చేసి, వంద థియేటర్లలో విడుదల చేయడం అంటే జనం ఆదరిస్తారన్న ఆశలు బాగానే వున్నాయన్నమాట.
మార్కెట్ నిండా బోలెడు సినిమాలు వున్నపుడు, థియేటర్లు ఖాళీ లేనపుడు ఈ ప్రయోగం ఎందుకో? అన్నట్లు ఈ పాత శివకు కొత్త ట్రయిలర్లు కూడా విడుదల చేస్తారట. మరి ఇంతకీ కొత్త ఐస్ క్రీమ్ 2 కు పాత డేటేనా? మారుస్తారా?