ఆ మూడు నెలలు రెండు ఫ్యామిలీలవే

మెగా ఫ్యామిలీ..అక్కినేని ఫ్యామిలీ..రెండింటికీ మంచి బంధం వుంది. దసరా సీజన్ కు అటు ఇటు మొత్తాన్ని ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు పంచేసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి నవంబర్, డిసెంబర్ వరకు వీళ్ల సినిమాలే…

మెగా ఫ్యామిలీ..అక్కినేని ఫ్యామిలీ..రెండింటికీ మంచి బంధం వుంది. దసరా సీజన్ కు అటు ఇటు మొత్తాన్ని ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు పంచేసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి నవంబర్, డిసెంబర్ వరకు వీళ్ల సినిమాలే వరుసగా షెడ్యూల్ అయి వున్నాయి. 24న సాయి ధరమ్ తేజ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' విడుదలవుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు..దిల్ రాజు నిర్మాత. 2న వరణ్ తెజ్ కంచె విడుదలవుతోంది. క్రిష్ దర్శకుడు..9న రుద్రమదేవి విడుదల కావడానికి అవకాశం అయితే వుంది. ఇందులో బన్నీ కీలక పాత్ర పోషించాడు. 15, లేదా 16, 17ల్లో రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లోని బ్రూస్ లీ వస్తోంది.ఇలా నెల రోజులలో మెగా హీరోల సినిమాలు నాలుగు విడుదలవుతున్నాయి.

ఇక నాగ్ ఫ్యామిలీ..అక్టొబర్ 21న తన వంతు మొదలెడుతోంది..ఆ రోజు అఖిల్ తొలి సినిమా అఖిల్ విడుదలవుతోంది. వివి వినాయక్ దర్శకుడు. దానికి రెండు వారాలు గ్యాప్ ఇచ్చి అంటే అక్టోబర్ లో గౌతమ్ మీనన్-నాగ్ చైతన్య సినిమా సాహసం..శ్వాసగా సాగిపో రావడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఆ సినిమాకు రెండు వారాలు గ్యాప్ ఇచ్చి నాగ్ ..'సోగ్గాడే చిన్ని నాయనా' షెడ్యూల్ చేస్తున్నారు. ఇలా ఒక రౌండ్ అయిపోగానే మళ్లీ బన్నీ-బోయపాటి సినిమా, పవన్ కళ్యాణ్-రవీంధ్ర సినిమా, నాగ్-కార్తీల సినిమా సెకెండ్ రౌండ్ లో వచ్చేస్తాయి. 

ఇప్పుడు మెగా క్యాంప్ లో వరుసగా సినిమాలు చేసే సెటిల్డ్ హీరోలు కనీసం అయిదుగురు వున్నారు. అలాగే నాగ్ క్యాంప్ లో ముగ్గురు వున్నారు. సో, టాలీవుడ్ బాక్సాఫీస్ ను కళకళలాడించడంలో ఈ ఎనిమిదిమంది పాత్ర కాస్త కీలకమే.  మిగిలిన ఫ్యామిలీల్లో కూడా హీరోలు లెక్కకు వున్నా, అంత ఇంపాక్ట్ కలుగ చేయలేకపోతున్నారు. కారణం..ప్లానింగ్ నే కావచ్చు. అరవింద్, నాగ్ ల ప్లానింగ్ నే వేరు.