ఆమె తో డేట్ అంటే పడి చస్తున్నారు… ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని వారు కనిపిస్తున్నారు… ఆమెతో ఈ విషయంలో కమ్యూనికేట్ కావడానికి కూడా మార్గాలు ఏర్పడటంతో అనేక మంది అప్రోచ్ అవుతున్నారు. ఈ పరిస్థితులను ఆమె కూడా బాగానే క్యాష్ చేసుకొంటోంది! ఇంత వరకూ ఒక్క సరైన సినిమాలో హీరోయిన్ గా నటించలేదు కానీ.. ఆమె చాలా మందికి కలల రాణిగా మారింది. తన క్యూట్ నెస్ తో అనేక మందికి నిద్రలేకుండా చేస్తోంది.
దాదాపు రెండేళ్ల కిందట వెలుగులోకి వచ్చిన ఆమె కు అప్పటి నుంచి తెగ డిమాండ్ ఉంది. ఆమె తో డేట్ కోసం ఇండస్ట్రీలోని వారి కన్నా.. బయటి వారే తె గ ఆసక్తి చూపుతున్నారు. హై ఫై సర్కిల్స్ లో ఆమె తో డేట్ చాలా వ్యాల్యూ. ఈ పరిస్థితులను ఆమె కూడా క్యాష్ చేసుకుంటోంది. సరదా సాయంత్రాలతో బాగా సంపాదిస్తోంది!
ఒక పెద్ద హీరో నటించిన ఫ్యామిలీ కాన్సెప్ట్ తో వెలుగులోకి వచ్చిందామె. ఆ సినిమాలో చేసింది చాలా చిన్న పాత్రే అయినా.. అంతకు ఎన్నో రెట్ల గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఇండస్ట్రీలో అలాంటి ప్రాధాన్యం లేని పాత్రలే దక్కుతున్నాయి.
తెరపై అలా లాగిస్తున్న ఈ భామ… తెర వెనుక మాత్రం తన కంపెనీ కోసం పడిచచ్చే వారి పాలిట డ్రీమ్ గర్ల్ గా చెలామణి అవుతోంది. ఆమె డేట్ కు ధర కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఒక సాయంత్రం ఆమె విలువైన కంపెనీ దాదాపు ఐదారు లక్షల వరకూ పలుకుతోంది! మరి క్రేజ్ ఉన్నప్పుడు ఆ మాత్రం ధర పెద్ద విశేషం కాదేమో!