అల్లుడిని అమ్మేసారు

బెల్లంకొండ తెలివైన వాడు. భారీ బడ్జెట్, భారీ చిత్రాల దర్శకుడు, టాప్ హీరోయిన్ ను జోడించి కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తో రభస మొదలెట్టాడు. ఇప్పడు…

బెల్లంకొండ తెలివైన వాడు. భారీ బడ్జెట్, భారీ చిత్రాల దర్శకుడు, టాప్ హీరోయిన్ ను జోడించి కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తో రభస మొదలెట్టాడు. ఇప్పడు అల్లుడు శీను సినిమాను శాటిలైట్ కు ఇచ్చే విషయంలో కూడా తెలివితేటల ప్రదర్ళించాడని వినికిడి. రభస రైట్లు చూపించి, అల్లుడు శీను కు మంచి రేటు రాబట్టాడట. 

దగ్గర దగ్గర నాలుగున్నర కోట్లకు జెమిని వాళ్లతో మాటలు ముగిసినట్లు తెలుస్తోంది. కొత్త హీరో సినిమాకు నాలుగున్నర కోట్లు అంటే చిన్న సంగతి కాదు. వినాయక్, సమంత ను కలిపేసుకున్నా కూడా. ఇదిలా వుంటే శాటిలైట్ ఎంత వచ్చినా అల్లుడి శీను కు బెల్లంకొండ ఖర్చు చేసింది వర్కవుట్ అయ్యేది కాదని టాలీవుడ్ వర్గాల బోగట్టా. కేవలం కొడుకును లాంచ్ చేయడం అన్న దృష్టితోనే ఖర్చు చేస్తున్నాడనుకోవాలి తప్ప, లాభం కోసం కాకపోవచ్చు. దీని తరువాత రెండు మూడు సినిమాలు వస్తే లాస్ కవరైపోతుంది.