బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ అతి త్వరలో పెళ్ళి పీటలెక్కనుందంటూ ఓ న్యూస్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న విషయం విదితమే. అయితే ఈ ఊహాగానాల్ని కత్రినా కొట్టి పారేసింది. రణ్‌బీర్‌కపూర్‌తో కత్రినాకైఫ్ కొన్నాళ్ళుగా ‘డేటింగ్’ చేస్తోంది. ఇద్దరి మధ్యా డేటింగ్ ముదిరి పాకాన పడింది. ఆ డేటింగ్ కాస్తా పెళ్ళికి దారి తీయనుందని ఊహాగానాలు రావడాన్ని తీవ్రంగా ఖండించిన కత్రినా, ‘నా పెళ్ళికి మీ తొందరేంటి.?’ అంటూ మీడియాపై గుస్సా అయ్యింది.
‘ప్రేమ, పెళ్ళి అనేవి వ్యక్తిగత విషయాలు. వాటి గురించి ఎవరూ ఎక్కువగా ఊహించాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలూ నేనే చెబుతా..’ అంటూ కత్రినాకైఫ్ వివరణ ఇచ్చుకుంది. అయితే, గాసిప్స్ మాత్రం యధావిధిగా గుప్పుమంటూనే వున్నాయి.
కత్రినా, రణ్‌బీర్ ఓ ఖరీదైన ఫ్లాట్‌ని ముంబైలో ఇటీవలే కొనుగోలు చేయడం, దాంట్లో ఇద్దరూ కలిసి వుండడం (ఓసారి మీడియా కెమెరాలకి ఇద్దరూ ఆ ఫ్లాట్‌లోకి వెళుతూ చిక్కేశారు) ఇవి చాలవా వీరిద్దరి మధ్యా ఎఫైర్ ముదిరి పాకాన పడిందనడానికి.. అంటూ బాలీవుడ్ సినీ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
అయినా రణ్‌బీర్‌తో ఎఫైర్‌ని కొట్టి పారేయడానికి మొహమాటపడ్తున్న కత్రినా, పెళ్ళి గురించిన గాసిప్స్‌పై ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తున్నట్టు.? ఏమో మరి ఆమెకే తెలియాలి.