నమ్మినా, నమ్మకపోయినా, టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..గీతాఆర్ట్స్ కి మెగా క్యాంప్ కి నడుమ దూరం పెరుగుతోంది అన్నది. అంటే బావా బామ్మర్దులు చిరంజీవి, అల్లు అరవింద్ ల నడుమ అన్నమాట. అలా అని మొహా మొహాలు చూసుకోకపోవడమేమీ లేదు. హాయ్ అంటే హాయ్ అంటున్నారు. కలుస్తున్నారు..అంతా ఓకె. కానీ, ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంతటికీ పెద్ద దిక్కు, బ్యాక్ బోన్ అల్లు అరవింద్. ఆయన సలహా..ఆయన మాట..ఆయన నిర్ణయం అన్నది అందరికీ కీలకం. ఇప్పుడు అదేం లేదని
ఇప్పుడు అల్లు అరవింద్ ప్లేస్ ను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేసారు. పవన్ కళ్యాణ్ మాట ఇప్పుడు మెగా కుటుంబంలో శిలా శాసనం. ఆయన సలహా..ఆయన మాట..ఆయన ప్లానింగ్ ఇప్పుడు కీలకం అని వినికిడి. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు సలహాలను తీసుకుంటున్నారు..అపారంగా గౌరవిస్తున్నారు అన్నది టాలీవుడ్ లేటెస్ట్ ఇన్ సైడ్ టాక్.
కొన్నాళ్ల క్రితం పవన్ కు చిరుకు ఉప్పు నిప్పు అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడదేం లేదట. అంతా కలిసారు. పైగా మెగా హీరోలైన రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ ల కెరీర్ ప్లానింగ్ పై కూడా పవన్ సలహాలు వుంటున్నాయట. ఈ క్రమంలోనే పవన్ తాను ఓ సినిమా చరణ్ తో నిర్మించడానికి రెడీ అయ్యారు.
అంతా బాగానే వుంది. కుటుంబం ఒక్క తాటిపైకి రావడం, అన్నదమ్ములు ఏక మాట మీద వుండడం తప్పేమీ కాదు. సంతోషించాల్సిన సంగతే. అయితే అసలు మెగా క్యాంప్ ఈ స్థాయికి రావడానికి, చిరంజీవి ఇన్ని విజయ శిఖరాలు అధిరోహించడానికి, ఎంతో ప్లానింగ్, మరెంతో చాకచక్యం కనబర్చింది అల్లు అరవిందే అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. రామ్ చరణ్ కెరీర్ మలుపు తిప్పిన మగధీర నిర్మించి ఇచ్చింది ఆయనే. మరి అలాంటి వ్యక్తి, పైగా బావమరిదికి చిరుకు మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతున్నట్లో?