ఈసారి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ పోటీలో రెండు తెలుగు సినిమాలతో ఢీ కొనడానికి రెడీ అయింది విశాల్ జయసూర్య సినిమా. కానీ ఇప్పుడు పబ్లిసిటీ చూస్తుంటే, ఆ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
భలే భలే మగాడివోయ్, డైనమైట్ సినిమా కోటిన్నర నుంచి రెండు కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేసేస్తున్నాయి. దాంతో సినిమాలకు ఓపెనింగ్స్ ఎలా వుంటాయో కానీ, హైప్ మాత్రం బాగానే వచ్చింది. ఇలాంటి కాంపిటీషన్ లో విశాల్ సినిమా అస్సలు ఏ హడావుడి లేకుండా అలా చప్పగా పడి వుంది.
రేపు విడుదల పెట్టుకుని, కనీసం ఓ వార్త కానీ, మాటా మంతీ కానీ, ఏమీ లేదు. విశాల్ చెన్నయ్ లో నడిగర్ సంఘం ఎన్నికల్లో తలమునకలై వున్నాడు. ఇక్కడ మరి ఆ సినిమా వ్యవహారాలు చూసేవారే కనిపించడం లేదు. మరి తమిళ వెర్షన్ 4న విడుదల అంటున్నారు. దాంతో పాటే ఇక్కడా విడుదల చేస్తాడో, కాస్త వెనగ్గా వస్తాడో మరి.