పాపం బోయపాటి!

రెండ్రోజుల క్రితం బోయపాటి శ్రీనుకి మెగా క్యాంప్‌ నుంచి పిలుపు వచ్చిందనే న్యూస్‌ వచ్చింది. బెల్లంకొండ సురేష్‌ తనయుడితో సినిమా చేస్తోన్న బోయపాటి మళ్లీ మెగా క్యాంప్‌లోకి వెళ్లడం ఏమిటని అనుకున్నారు. కానీ వెంటనే…

రెండ్రోజుల క్రితం బోయపాటి శ్రీనుకి మెగా క్యాంప్‌ నుంచి పిలుపు వచ్చిందనే న్యూస్‌ వచ్చింది. బెల్లంకొండ సురేష్‌ తనయుడితో సినిమా చేస్తోన్న బోయపాటి మళ్లీ మెగా క్యాంప్‌లోకి వెళ్లడం ఏమిటని అనుకున్నారు. కానీ వెంటనే బెల్లంకొండ ఆఫీస్‌ నుంచి ఆ న్యూస్‌ని ఖండిస్తూ నోట్‌ వచ్చింది. సో.. అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా అనే న్యూస్‌ నిజం కానట్టే. 

కాకపోతే బోయపాటి శ్రీను మరోసారి స్టక్‌ అయిపోయాడని కూడా అర్థమవుతోంది. బెల్లంకొండ సురేష్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌కి మొదలు కాకుండానే హంసపాదు ఎదురయింది. దీంతో ఇది ఎప్పుడు మొదలవుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి. లెజెండ్‌ తర్వాత వెంటనే ఒక సినిమా స్టార్ట్‌ చేద్దామని చూసిన బోయపాటి శ్రీనుకి ఈసారి ఇలా అవాంతరం వచ్చి పడింది.

ఇంతవరకు దమ్ము తప్ప బోయపాటి తీసిన సినిమాలన్నీ సక్సెస్‌ అయ్యాయి. బాలకృష్ణతో వరుసగా రెండు విజయాలు అందించి తన సత్తా చాటుకున్నాడు. ఇంత మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నా కానీ బోయపాటికి దర్శకుడిగా స్టార్‌డమ్‌ రాలేదు. అలాగే వరుసపెట్టి అవకాశాలూ రావడం లేదు. ప్రతి సినిమా తర్వాత మరో దానికి నిరీక్షణ తప్పడం లేదు.