రాజమౌళికి ఓ దాచుకోలేని అలవాటు వుంది. ఏదైనా తనకు నచ్చినది ఎక్కడైనా కనిపిస్తే, దానిన్ని తన సినిమాల్లో వాడేసుకోవడం. బాహుబలి వరకు దాదాపు అన్ని సినిమాల్లో వుంది అది. బాహుబలి ఫస్ట్ లుక్ అప్పుడే ఇలాంటి విమర్శలు వినిపించాయి. బాహుబలికి హైలైట్ అయిన కట్టప్ప తన తలపై ప్రభాస్ కాలు వుంచుకునే సీన్ ను కూడా హాలీవుడ్ నుంచి యథాతథంగా కొట్టేసానని రాజమౌళే చెప్పాడు.
ఇక వర్తమానానికి వస్తే, రాజమౌళి కుమారుడు కార్తీక్ కూడా ఈ విషయంలో తన ప్రతిభ ప్రదర్శించడం ప్రారంభించాడట. కార్తీక్ ఇటీవల నాగ్ తనయుడి సినిమా అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కార్తీక్ నే డిజైన్ చేసాడు. ఈ
పోస్టర్ డిజైన్ కు మూలం జపనీస్ సినిమా డ్రాగన్ బాల్ అంట. ఆ సినిమా పోస్టర్ లో హీరో ఫోజు కాస్త అటు ఇటు చేసి ఈ పోస్టర్ తయారు చేసాడని టాక్. క్రియేటివిటీ వున్నవారు కంపెనీ పెట్టినా పని దొరకదు. కానీ సెలబ్రిటీల పిల్లలు కంపెనీలు పెడితే పనులు ఇట్టే వస్తాయి. అప్పుడు ఇలాంటి విమర్శలే వినిపిస్తాయి.