క్రిష్ కు చేతకాలేదు

అవును నిజమే. దర్శకుడు క్రిష్ కు చేతకాలేదు. కంచె లాంటి సినిమా తలకెత్తుకున్న మరుక్షణం నుంచి దానికి ఎలా హైప్ తెచ్చుకోవాలో? ఇంత అద్భతమైన ట్రయిలరే చూపించే అవకాశం వున్న సినిమా తీస్తూ, కూడా…

అవును నిజమే. దర్శకుడు క్రిష్ కు చేతకాలేదు. కంచె లాంటి సినిమా తలకెత్తుకున్న మరుక్షణం నుంచి దానికి ఎలా హైప్ తెచ్చుకోవాలో? ఇంత అద్భతమైన ట్రయిలరే చూపించే అవకాశం వున్న సినిమా తీస్తూ, కూడా ఎక్కడా ఫీలర్లు వదలకుండా, ఎక్కడా గ్యాసిప్ లకు తావివ్వకుండా, తన పని తాను చేసుకుపోయాడు.

లేకుంటే ఈ పాటికి ఆ సినిమా గురించి జనం ఎంతలా మాట్లాడుకోవాలి. తమిళంలో మదరాసు పట్టణం మొదలు పెట్టిన దగ్గర నుంచి విడుదల వరకు ఎంత హడావుడి. కంచె కు ఏదీ ఆ హడావుడి. ఎప్పుడు సెట్ లు వేసాడు..ఎక్కడ తీసాడు..ఆ మేకప్ లేంటి? క్లాసిక్ గా నిలిచిపోతుందనిపించే ఆ టేకింగ్ ఏమిటి? ఒక్క దాని గురించి ఎక్కడన్నా చిన్న ముచ్చట వుందా?

Click Here For Trailer

ఇదే రాజమౌళి సినిమా ప్రారంభిసే, ఆసక్తి ఏం రేంజ్ లో పెంచుకుంటూపోతారు? ఆ విద్య క్రిష్ కు చేతకాలేదు. ఇప్పుడు వున్నట్లుండి ఉరుములేని పిడుగులా ట్రయిలర్ చటుక్కున జారవిడిచాడు. చూసిన వాళ్లు అవాక్కయ్యేలా? ఏమిటీ? ఇలాంటి సినిమా ఒకటి మన దగ్గర ముస్తాబు అవుతోందా? ఇలాంటి సినిమా ఒకటి రాబోతోందా..అని ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఇచ్చాడు.

థాంక్స్ టు క్రిష్..ఇప్పటికైనా ఆ అవకాశం ఇచ్చినందుకు. ఓ మంచి ట్రయిలర్ ను జనాలకు చూపించినందుకు. మొత్తానికి క్రిష్ కు ఒకటి మాత్రం చేతనయింది..అతను తన ట్రయిలర్ తో, ప్రేక్షకుల గుండెల్లో 'కంచె' కట్టేసాడు.