చాలా రోజుల తరువాత దిల్ రాజు మళ్లీ నైజాంలో సినిమా కొన్నారు. కొన్న చాలా సినిమాలు నష్టాలు తేవడంతో నైజాం లో కొనుగొళ్లు ఆపేసి, విశాఖలో మాత్రం కొంటూ వస్తున్నారు. ఇదికాక నైజాంలో మిగిలిన పంపిణీదారులు కూడా ఇదే బాట పట్టారు. దాంతో పెద్ద సినిమాలు సైతం నేరుగా పంపిణీ చేసుకునే పరిస్థితి వచ్చింది.
గోవిందుడు అందరి వాడేలే, దిక్కులు చూడకు రామయ్యా, కార్తికేయ, జోరు ఒకటేమిటి ఇలా అన్ని సినిమాలు అడ్వాన్సుల మీదే విడుదల వ్వవహారం నడుస్తోంది. ఇధే పరిస్థితి బ్రదర్ ఆఫ్ బొమ్మాళికి కూడా వచ్చింది. దీంతో నిర్మాత, అల్లరి నరేష్ దగ్గరి బంధువు అమ్మిరాజు నేరుగా విడుదలకు సిద్దమైపోయారు.
కానీ దిల్ రాజు ఓ సారి చూస్తానని అడగంతో ఆయనకు చూపించారు. దాంతో ఆయనకు నచ్చి కొనేసారు. ఏ మొత్తానికి కొన్నారన్నది తెలియకపోయినా, ఒప్పందమైతే జరిగింది. మొత్తానికి మళ్లీ దిల్ రాజు నైజాం పంపిణీ ట్రాక్ మీద అడుగుపెట్టారు.