చరణ్ సినిమా బ్రూస్ లీ యేనంట

వెబ్ సైట్లు అన్నీ చిన్నప్పుడు చెప్పాయి..చరణ్-శ్రీనువైట్ల సినిమా పేరు బ్రూస్ లీ అని. అబ్బే కాదు ఇంకా డిసైడ్ చేయలేదు అంటూ వారానికో ప్రెస్ నోటు. ప్రతి ప్రెస్ నోట్ లో, అదోలైన్ కామన్…

వెబ్ సైట్లు అన్నీ చిన్నప్పుడు చెప్పాయి..చరణ్-శ్రీనువైట్ల సినిమా పేరు బ్రూస్ లీ అని. అబ్బే కాదు ఇంకా డిసైడ్ చేయలేదు అంటూ వారానికో ప్రెస్ నోటు. ప్రతి ప్రెస్ నోట్ లో, అదోలైన్ కామన్ అయిపోయంది. సినిమా పేరు డిసైడ్ కాలా అంటూ. దాంతో మెరుపు, విజేత అంటూ మరో రెండు పేర్లు వినిపించాయి.

ఈ లోగా సదరు బ్రూస్ లీ పేరుతో తమిళంలో ఓ సినిమా రెడీ అయిపోయింది. అయినా ప్రెస్ నోట్లు మామూలే..చివర్న..గమనిక అన్నట్లుగా, సినిమా పేరు ఇంకా డిసైడ్ చేయలా అంటూ ఓ లైన్ మామూలే. ఆఖరికి ఇప్పుడు చటుక్కున లోగో డిజైన్ వదిలారు. చరణ్ సినిమా పేరు బ్రూస్ లీ అంటూ. హమ్మయ్య..ఓ పనైపోయింది. జనాలకు నచ్చినా, నచ్చకున్నా, చరణ్ సినిమా  పేరు అదే..బ్రూస్ లీ.

ఎప్పుడో ఎయిటీస్ లో సుమన్, భాను చందర్ లాంటి వాళ్లు నటించే సినిమాలకు లేదా, డబ్బింగ్ సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు చరణ్ సినిమాకు పెట్టారు కాబట్టి, దాని వెయిట్ పెరుగుతుంది. పాపులర్ అయిపోతుంది. ఎంతయినా పెద్ద హీరో, పెద్ద డైరక్టర్..పెద్ద నిర్మాత..పెద్ద సినిమా కదా..