హీరో కళ్యాణ్ రామ్ ను కిక్ 2 ఘోరంగా దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఓ పది కోట్ల మేరకు నష్టం మిగులుస్తుందని అంచనా వేసారు. కానీ ఇప్పుడు అది మరో అయిదో, పదో పెరిగేలాగే వుంది.
నిజానికి కిక్ 2 మీద కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పటాస్ కు ముందు కళ్యాణ్ చాలా దెబ్బలు తిన్నాడు. అయితే మంచివాడుగా ఇండస్ట్రీలో పేరు వుండడంతో నిలదొక్కుకున్నాడు. పటాస్ తో లాభాలు కళ్ల చూసాడు.
కానీ కిక్ 2 విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డిని గుడ్డిగా నమ్మి, తన స్టామినా, రవితేజ మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా 40 కోట్ల వరకు ఖర్చు చేసేసాడు. అదే ఇప్పుడు దెబ్బతీసింది. ఇరవై నుంచి పాతిక కోట్లలో తీసి వుంటే లాస్ వుండేది కాదు. కళ్యాణ్ రామ్ రికవరీ కావాలంటే కాస్త టైమ్ పడుతుంది. లేదా సోదరుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసుకోవాలి. మంచి డైరక్టర్ ను చూసి.